»Three More Days Of Heavy Sun Meteorological Department Warns
Hyderabad Temperatures : మరో మూడు రోజులు భారీ ఎండలు..వాతావరణ శాఖ హెచ్చరిక
మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) వెల్లడించింది. ఏప్రిల్ 12వ తేది నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
రోజురోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. భానుడి భగభగలకు పగటి పూట ఉష్ణోగ్రతలు(Temperature) భారీ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఒక ఎత్తు ఇకపై మరో ఎత్తు అన్నట్లు ఎండలు ఎవ్వరినీ వదలడం లేదు. జనాలు ఓ వైపు ఎండ వేడి(Heat)ని, మరోవైపు ఉక్కపోతలను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) తెలంగాణ (Telangana) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) వెల్లడించింది. ఏప్రిల్ 12వ తేది నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ప్రజలు వడదెబ్బ (Sunburn) తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather station) తెలిపింది. అవసరమైతే తప్పా ఎవ్వరూ బయటకు రావొద్దని కోరింది. గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు విపరీతంగా వీస్తున్నాయని, దీంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.