• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

RTC డిపో మేనేజర్‌కు వినతి

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మహేశ్వరంలో ప్రతి బస్స్ హాల్టింగ్ చేయాలని శనివారం కౌన్సిలర్ మృత్ నాయక్, శిరీష రాజు RTC డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలు బస్సు ఆపకపోవడంతో నర్సంపేటకు రావాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి బస్సు హాల్టింగ్ చేయాలని కోరారు.

February 21, 2026 / 09:34 PM IST

‘వెంకటేశ్వర స్వామితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోంది’

E.G: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని, రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. వారి తీరు హిందువుల మనోభావాల‌ను దెబ్బతీశారన్నారు.

February 21, 2026 / 09:34 PM IST

‘కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు సిగ్గుచేటు’

అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టా అని పేర్కొన్నారు.

February 21, 2026 / 09:31 PM IST

సంసద్ ఖేల్ ముగింపు సభలో కేంద్రమంత్రి

TG: హైదరాబాద్‌ సికింద్రాబాద్ పరిధిలో గత నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడల పండుగ ఇవాళ్టితో ముగిసింది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక జిమ్ఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ముగింపు వేడుకకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

February 21, 2026 / 09:31 PM IST

అక్రమ ఇసుక రవాణా టిప్పర్‌ సీజ్

KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు శనివారం తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 09:30 PM IST

‘పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి’

KDP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆర్‌ఐవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు స్వల్ప సడలింపు ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 09:30 PM IST

మహేందర్ రెడ్డితో మాకు సంబంధం లేదు: కాంగ్రెస్

TG: బీజేపీ నాయకులు గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని.. కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సందీప్ హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మహేందర్ రెడ్డితో తమకు సంబంధం లేదన్నారు. మహేందర్ రెడ్డి తమ నియోజకవర్గ నాయకుడు కాదన్నారు. ఎమ్మెల్యే కేవీఆర్ పోలీసులను బెదిరిస్తున్నారన్నారు.

February 21, 2026 / 09:27 PM IST

గడ్డి మందును నిషేధించండి: వినోద్ కుమార్

TG: సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ గడ్డి మందును నిషేధించాయి. తెలంగాణలో కూడా గడ్డిమందు నిషేధంపై ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన మెజార్టీ రైతుల్లో.. గడ్డిమందును వాడిన వారే ఎక్కువ’ అని లేఖలో పేర్కొన్నారు.

February 21, 2026 / 09:26 PM IST

T20 WC: వర్షార్పణమైన పాక్-కివీస్ పోరు

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. కాగా, రేపు భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

February 21, 2026 / 09:21 PM IST

అక్రమ వలసదారులను ఏరివేయడం సాధ్యమే: అమిత్ షా

నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతున్నట్లే.. చొరబాటుదారులను ఏరివేయడం కూడా సాధ్యమేనని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా.. రాబోయే ఐదేళ్లలో దేశం నుంచే తొలగిస్తామని చెప్పారు. ‘గతంలో రాహుల్ అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని చెప్పారు కానీ, చేయలేదు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంకు’ అని షా ఆరోపించారు.

February 21, 2026 / 09:20 PM IST

జార్ఖండ్‌లో పేలిన మందుపాతర

జార్ఖండ్‌లోని సింగ్‌భం ప్రాంతంలో భారీ ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన భత్రతా దళాలు గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.

February 21, 2026 / 09:17 PM IST

‘బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలి’

ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్‌వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

February 21, 2026 / 09:11 PM IST

ఈ నెల 23న తెలంగాణకు కేంద్రమంత్రి

TG: ఈ నెల 23న అలంపూర్ జోగులాంబ ఆలయానికి కేంద్రమంత్రి కుమారస్వామి వస్తున్న నేపథ్యంలో.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిపాడ్ నుంచి ఆలయం వరకు రహదారులు బాగుండాలని, విద్యుత్ తీగలు సరిచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు జరగాలని సూచించారు.

February 21, 2026 / 09:11 PM IST

దేవాదులలో తట్టెడు మట్టి తీయలేదు: పెద్ది సుదర్శన్

TG: దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి నిధులు కేటాయించని CM రేవంత్ రెడ్డికి జిల్లాలో పర్యటించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చి.. రెండేళ్లుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదన్నారు. CM, మంత్రుల వైఫల్యం దేవాదుల ఆయకట్టు రైతులకు శాపంగా మారిందన్నారు.

February 21, 2026 / 09:10 PM IST

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

AP: తూ.గో.జిల్లా దేవరపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 09:08 PM IST