సూడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో (Sudan tragedy) 200 మంది మృతి చెందగా, 1800 మంది గాయపడ్డారు. ఇక్కడ సైన్యం, పారామిలిటరీ మధ్య మూడు రోజులుగా పోరు కొనసాగుతోంది. 2021వ సంవత్సరంలో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా ఆల్ బుర్హాన్ కు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది (Sudan’s army chief Abdel Fattah al-Burhan and his deputy, Mohamed Hamdan Daglo). దౌత్యవేత్తలు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారు. కానీ మూడ్రోజులుగా పోరాటం సాగుతోంది (Sudan’s Generals battle). వీరి మధ్య వారాలుగా సాగిన అధికార పోరాటం శనివారం నుండి ఘోరమైన హింసాత్మకంగా మారింది. దీంతో మూడ్రోజుల్లో రెండొందల మంది మృతి చెందారు. దీర్ఘకాలంగా ఇక్కడ అస్థిరత్వం కనిపిస్తోందని, దీంతో అక్కడ పోరాటం (Sudan violence) సుదీర్ఘంగా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సూడాన్‌లోని (Sudan tragedy) యూరోపియన్ యూనియన్ రాయబారిపై (European Union’s ambassador to Sudan) సోమవారం నగరంలోని అతని ఇంటిపై దాడి జరిగినట్లు బ్లాక్ అగ్ర దౌత్యవేత్త జోసెప్ బోరెల్ తెలిపారు. దౌత్య ప్రాంతం, ఇక్కడి దౌత్య సిబ్బంది భద్రత సూడానీస్ అధికారుల ప్రాథమిక బాధ్యత అని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారే చూసుకోవాలని బోరెల్ తెలిపారు. కాగా, ఈ సంఘర్షణలో వైమానిక దాడులు, ఫిరంగి దళాల కాల్పులు, భారీ కాల్పులు కనిపించాయి. పలు అవుట్లెట్ల వద్ద బ్రెడ్, పెట్రోల్ కోసం క్యూలు కనిపించాయి (queues for bread and petrol ). విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. సుడాన్ లో కాల్పులు దేశానికి వినాశకరమని, తక్షణమే కాల్పులు నిలిపి వేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు.ఈ దాడుల్లో ఖార్టూమ్ తో సహా పలు నగరాల్లోని ఆసుపత్రులు దెబ్బతిన్నాయి.
Where is African Union, where is Arab League, where is United Nation.