కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ హైదరాబాదులో (Hyderabad) సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలో పాల్గోన్నారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులకు అమిత్ షా రివార్డులు అందించారు. అమిత్ షా హైదరాబాదు (Hyderabad) నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సి విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
రానా నాయుడు వెబ్ సిరీస్(rana naidu web series) ద్వేషించే అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు హీరో రానా(Daggubati Rana) ట్విట్టర్ వేదికగా మార్చి 12న పేర్కొన్నాడు. దీంతోపాటు ఈ సిరీస్ ను అభిమానించే వారికి సైతం ధన్యవాదాలు తెలిపాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరోవైపు ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఈ సిరీస్ నిండా బూతులు, అడల్ట్ కంటెంట్ ఉందని కామెంట్లు చేస్త...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ టెస్టు నాలుగో రోజులో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) అరుదైన రికార్డును సృష్టించాడు. మూడేళ్ల తర్వాత తన మొదటి టెస్ట్ సెంచరీని విరాట్ సాధించాడు. దీంతో దేశంలో తన 50వ టెస్టు ఆడుతూ గవాస్కర్(Gavaskar) నం.4లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన ఘనతను కోహ్లీ కూడా సాధించడం విశేషం.
ఇన్ స్టా గ్రాం(Instagram)లో ఓ యువతిని వేధించిన క్రమంలో ఆగ్రహం చెందిన ఆమె ఓ యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి(kavali)లో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివరాలెంటో ఓసారి చూసేయండి మరి.
బెర్లిన్(berlin)లోని పబ్లిక్ కొలనుల వద్ద ఉన్న ఈతగాళ్లందరూ త్వరలో టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించబడతారని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఓ మహిళ టాప్‌లెస్‌గా స్నానం చేసేందుకు రాగా..అక్కడి నిర్వహకులు ఆమెను అలా చేయోద్దని తిరిగి పంపించారు. దీంతో ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సెనేట్ అంబుడ్స్‌పర్సన్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది.
54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే వేడుకలు హైదరాబాద్లో(hyderabad) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై పరేడ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు చిత్రంలోని రంజితమే పాటకు(ranjithame song) పుదుకోట్టె జిల్లా కలెక్టర్ కవితా రాము(Kavitha Ramu) డ్యాన్స్(dance) చేసి అదరగొట్టారు. తన తోటి మహిళా సిబ్బందితో కలిసి వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఈ వీడియో(viral video) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైల్వే జాబ్స్ కుంభకోణం(railway jobs scam) కేసు(case)లో లాలూ ప్రసాద్ కుటుంబంపై (lulu Prasad Yadav's family) జరిపిన దాడుల్లో కోటి రూపాయల లెక్కలో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ(ED) తెలిపింది. దీంతోపాటు 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు.
ఏపీ(ap)లో మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం(rain forecast) ఉందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం పడనుందని తెలిపింది. ఈ క్రమంలో పంట కోత దశలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
బీసీలు ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సును ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు భారతీయ సమాజానికి వెన్నెముక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ(ap)లో రూ.34 వేల కోట్ల బీసీ సంక్షేమ నిధులను పక్కదారి పట్...
తెలంగాణలో రేపు ఎమ్మెల్యే ఎన్నికలు(MLC elections) జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ బృందాల తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, గంజాయితో పాటు 41 లక్షల నగదు, 1,800 లీటర్ల మద్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు.
యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అనుచిత పదజాలంతో వీడియోను అప్‌లోడ్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) అన్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసుల(police)కు ఫిర్యాదు(complaint) చేసినట్లు ఎంపీ వెల్లడించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా?వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) అని ప్రశ్నించారు. మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్(Bandi Sanjay) వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించడం సంతోషం అని ఆమె అన్నారు.
వందేభారత్ (Vande Bharat) రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్(Secunderabad) నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు ముందు భాగం దెబ్బతింది.
ఈ నెల 12న జరగాల్సిన టీపీవోబీ( Town Planning Building Overseer ) పోస్టులకు నిర్వహించాల్సిన రాతపరీక్షను, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్షల సంబంధిత కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానం ఉందని టీఎస్‌పీఎస్సీ (TSPSC)తెలిపింది.