బాలయ్య అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో… సెకండ్ సీజన్ మరింత సూపర్ డూపర్ గా దూసుకుపోతంది. సెకండ్ సీజన్ లో ఊహించని విధంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయుకులు కూడా వచ్చారు. కాగా… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ షోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ తో పాటు [&hell...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాలలో పోటీ చేస్తే పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ అనేసరికి ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సామాన్యుల నుండి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు సంధిస్తున్నారు. కొంతమంది పార్టీ రావొచ్చు.. పోటీ చేయవచ్చు కానీ విభజన సమస్యలను ఎలా పరిష్కరి...
హైదరాబాద్ లో మెట్రో సిబ్బంది ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. నేడు కూడా మెట్రో సిబ్బంది విధులకు గైర్హజరై… ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగోల్ మెట్రో కార్యాలయం వద్ద వీరి ధర్నా కొనసాగుతోంది. ఐదేళ్లుగా తమకు వేతనాలు పెంచలేదని టికెటింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా 11 వేలు జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. ఈక్రమంలోనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టికెంటింగ్ సిబ్బంది వ...
గుంటూరు టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు చంద్రబాబు కందుకూరు సభలో ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృత్యువాత పడగా, ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే గుంటూరు సభలో ముగ్గురు మృతి చెందారు. కందుకూరు సభలో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ వేలాది మందికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన...
విభజన అంశాలపై ఇష్టారీతిన మాట్లాడితే ఇరుకున పడతామని బీఆర్ఎస్ ఆందోళన చెందుతుందా? జాతీయ రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ నేతలకు అధిష్టానం సూచిస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అగ్రనాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. పలువురు తో...
రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశంలో చలి వణికిస్తున్నా… ఆయన తన పాదయాత్రకు ఎలాంటి పులిస్టాప్ పెట్టలేదు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలోనూ ఆయన కేవలం సాధారణ టీ షర్ట్ ధరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలు జనాలు.. ఇంట్లో నుంచి బయటకు రావడానికి స్వెట్ షర్ట్స్, స్వెట్టర్లు ధరిస్తుంటే.. ఆయన సాధారణ టీ షర్ట్ ధరించడం వెనక రహస్యాన్ని ఆయన సోదరి ప్రియాంక గాంధీ తెలియజేశారు. తన అ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ పార్టీ అధిష్టానం సడెన్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. ‘‘హాత్ సే హాత్ జోడ్ అభియాన్’’ పేరుతో యాత్ర నిర్వహించాలని ఆయన అనుకున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో ...
తెలంగాణ ముఖ్యమంత్ర కేసీఆర్.. తన బీఆర్ఎస్ పార్టీని… పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో విస్తరించే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సంగతి పక్కన పెడితే… పాలకులు మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అధికార పార్టీతో పాటు… ప్రతిపక్ష పార్టీలు కూడా.. కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడాన్ని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ముఖ్యమంత్రి క...
కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం కలిగింది. వరసగా రెండు ఘటనలలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో… ఆయన కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు స్పందించారు. స్థానిక టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని ప...
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కొందరు నేతలు ఆ పార్టీలో చేరారు కూడా. మరి కొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు జనాల పల్స్ ని బట్టి చేరాలా వద్దా అనేది ఆలోచిందామని అనుకుంటున్నారు. ఈ క్రమంలో… ఈ పార్టీ పై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఏపీలోకి బీఆర్ఎస్ రావటం మంచిదేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే...
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి అయోధ్య రామాలయం ప్రధాన పూజారి లేఖ రాశారు. ఆయన చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఫలవంతం కావాలని పేర్కొన్నారు. ఆయన యాత్ర ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ అయోధ్య రాముడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుతున్నానంటూ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం నాడు లేఖ రాశారు. మీరు ఎందుకోసమైతే భారత్ జోడో యాత్రను ప్రారంభించారో, అది ఫలవంతం కావాలన...
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ని పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కాగా… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పై తాజాగా విజయశాంతి స్పందించారు. ఏపీలో జనసేనను, ఆపార్టీతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తోట చంద్రశేఖరా, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు తదితరులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతా వెలుగులతో నిండిపోతుందని, యావత్ దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఏపీలో కొంతమంది ...
చదువుల తల్లి సరస్వతి మాతపై వివాదాస్పద రెంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలు హిందువుల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ దేశంలో హిందువులను, హిందూ దేవతలను విమర్శించడమే లౌకికవాదంగా మారిందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. లౌకికవాదం ముసుగులో కొంతమంది హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. చదువుల తల్లి సరస్వతి మాత పైన రెంజర్ల రాజేష్ తప్పుడు ప్రచారం చేసి...
చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ నాయకులకే లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు… లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని తమకు ల...