telangana commission of women has serious to bandi sanjay
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తమతో చాలా మంది బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పటికే వారంతా తమతో పలుమార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపారని..ఈ విషయం సీఎం కేసీఆర్ కు తెలియడంతో ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. గతంలో కూడా బీజేపీ నేతలు బీఆర్ఎస్ వారు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే టచ్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ టీం సభ్యులతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని..తనతో వారంతా ఫోన్ మాట్లాడారని తెలిపారు. ఈ కారణంగానే పోలీసులను పంపించి తన ఫోన్ ను కేసీఆర్ తీసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రస్తుతం తన ఫోన్ కేసీఆర్ దగ్గరే ఉందని..ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడమే పని అని బండి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కోసం తన ఫోన్ ను పోలీసులు మాయం చేశారన్న బండి..ఆ ఫోన్ బయటకొస్తే సంచలన నిజాలు బయటకొస్తాయనే కేసీఆర్ తన దగ్గరే ఆ ఫోన్ పెట్టుకున్నారని బండి ఆరోపించారు.