• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

TDP Win: ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాల్లో విజయం

ఏపీ(AP)లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ(TDP) అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు శుక్రవారం రెండో ప్రాధాన్యత లెక్కింపులో 94,510 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు.

March 18, 2023 / 10:32 AM IST

KTR : బండి సంజయ్ కి మతిలేదు… కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్ర‌భుత్వ‌ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిప‌డ్డారు.

March 18, 2023 / 10:18 AM IST

Virat Kohli Biopic: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ చరణ్?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్‌(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2023 / 10:22 AM IST

Pawan Kalyan : అగ్ని ప్రమాదంపై పవన్ రియాక్షన్ ఇదే….!

Pawan Kalyan : స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళన కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు అగ్నిప్రమాద ఘటనల్లో పలువురు మృతి చెందగా..తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.

March 18, 2023 / 10:00 AM IST

Ramcharan: హైదరాబాద్ చేరుకున్న చెర్రీ..అర్థరాత్రి పోటెత్తిన ఫ్యాన్స్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్(ram charan) చరణ్ పలు అవార్డుల కార్యక్రమాల తర్వాత శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు(reached hyderabad). ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్టు(begumpet airport)లో చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. పూలు పెద్ద ఎత్తున జల్లుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు.

March 18, 2023 / 09:30 AM IST

Minister Guggana: మద్యం సేల్స్ తగ్గించేందుకే రేట్లు పెంచాం

మద్యం వినియోగం తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(ap government) మద్యం ధరలను(liquor prices) పెంచినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(minister buggana rajendra prasad) తెలిపారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఆల్కహాల్ వినియోగం 38 శాతం తగ్గినట్లు వెల్లడించారు. మరోవైపు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల కంటే ఏపీలో ఆర్థిక లోటు మెరుగ్గా ఉందని బుగ్గన స్పష్టం చేశారు.

March 18, 2023 / 08:55 AM IST

Rain News: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రెండు రోజులు వానలు!

తెలుగు రాష్ట్రాల్లో(telangana, ap) మరో రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే(rain fore cast) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల వర్షం కురిసింది.

March 18, 2023 / 08:07 AM IST

Amit Shah: ఇద్దరు లెజెండ్ సినిమా హీరోలను కలిశా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)ను ఢిల్లీ(delhi)లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్‌(ram charan) శుక్రవారం రాత్రి కలిశారు. ఆ క్రమంలో అమిత్ షా చెర్రీకి శాలువా కప్పి సత్కరించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. అంతేకాదు ఇద్దరు లెజెండ్ హీరోలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

March 18, 2023 / 07:27 AM IST

PM MODI : తెలంగాణకు కేంద్రం శుభవార్త.. త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు..

తెలంగాణతో (Telangana) సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను(Mega Textile Park) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇంకా ఈ పార్కుల ద్వార...

March 17, 2023 / 10:10 PM IST

Bhatti Vikra Marka : సీఎం కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోసమే పాదయాత్ర : భట్టి

తెలంగాణ (Telanagna) తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాథ్‌ సే హాథ్‌ జోడో (Hath Se Hath Jodo) పాద యాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క (Bhatti Vikra Marka) తెలిపారు. వందలాది మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, తొమ్మిదేళ్ల నుంచి సీఎం కేసీఆర్, వారి కుటుంబం చేతితో బందీ అయ్యిందని భట్టి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో పద యాత్రలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఇచ్చోడ నుంచి స...

March 17, 2023 / 09:49 PM IST

IND vs AUS 1st ODI: టీమిండియా ఘన విజయం

ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌(ODI Match)లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. బరిలోకి దిగిన ఆసీస్(Ausis) బ్యాటర్లు 188 పరుగులకు ఆలౌట్(All Out) అయ్యారు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 191 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

March 17, 2023 / 09:18 PM IST

Tarun Chugh : బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన తరుణ్ చుగ్

తెలంగాణ (Telangana)లో టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్ర‌శ్నాప‌త్రములు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్(Hyderabad Gun Park) వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను(Bandi Sanjay) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తరుణ్ చుగ్(Tarun Chugh) ఖండించారు.

March 17, 2023 / 09:13 PM IST

RSP : గ్రూప్- 1 ప్ర‌శ్నాప‌త్రం లీకేజ్ వెనుక కవిత ఉన్నారు…RSP సంచలన కామెంట్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష ప్ర‌శ్నాప‌త్రం లీక్ (Question paper leak) కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన కామెంట్స్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, (MLC KAVITHA) మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ క...

March 17, 2023 / 08:48 PM IST

Ap Rain Alert: ఏపీలోని ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rain) ముంచెత్తుతున్నాయి. గురువారం నుంచి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శనివారం కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

March 17, 2023 / 08:48 PM IST

Amit Shah : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు.. చారిత్రాత్మక విజయం అమిత్‌ షా ట్వీట్‌

తెలంగాణ (Telangana) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం (AVN Reddy's victory) పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలిపారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బం...

March 17, 2023 / 07:32 PM IST