»Center Is Good News For Telangana Big Industry Will Be Set Up Soon
PM MODI : తెలంగాణకు కేంద్రం శుభవార్త.. త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు..
తెలంగాణతో (Telangana) సహా పలు రాష్ట్రాలలో టెక్స్టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను(Mega Textile Park) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ప్రధాని అన్నారు.
తెలంగాణతో (Telangana) సహా పలు రాష్ట్రాలలో టెక్స్టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను(Mega Textile Park) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ప్రధాని అన్నారు. పీఎం మిత్ర (PM Mitra) మెగా టెక్స్టైల్ పార్కులు 5F (ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ నుంచి ఫారిన్ వరకు) లక్ష్యదృష్టికి అనుగుణంగా టెక్స్టైల్స్ రంగాన్ని పెంచుతాయి. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, యూపీలలో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని పంచుకోవడానికి సంతోషిస్తున్నాను.
పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు టెక్స్టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తాయి. వాటితో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’(Make in India) ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప ఉదాహరణ అవుతుంది. ప్రగతికాపిఎంమిత్ర’ అంటూ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించాలని దేశంలోని యువతకు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆశయాన్ని సాకారం చేసేందుకు వేసిన ఆడుగులలో ఈ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు కూడా ఒక భాగం. ప్రపంచ టెక్స్టైల్స్ రంగంలో భారతదేశాన్ని కూడా బలపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9ని సాధించడంలో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ఇంకా ఈ పార్కులు మన దేశానికి పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉపాధి కల్పనను పెంపొందించడంలో, గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్లో(Global Textile Market )బలంగా నిలదొక్కుకోవడంలో సహాయపడుతుంది. ఈ పార్కులు టెక్స్టైల్ పరిశ్రమ(Textile Industry) అభివృద్ధి చెందడానికి, ఆపై విజయవంతం కావడానికి అవసరమైన అనుసంధానాలను కలిగి ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు కాబోతున్నాయి.
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.