RR: చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో సోమవారం సర్పంచ్ మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పెండింగ్ బిల్లు, తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలోని పని చేయని సీసీ కెమెరాలు రిపేర్ చేయించి వాటిని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్మికులకు యూనిఫామ్ అందజేసి వారిని సన్మానించారు.
NDL: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో అధికారులు వేగంగా పనిచేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. EPTS డాక్యుమెంట్ అప్‌లోడింగ్ లక్ష్యాన్ని 15 లక్షలకు పెంచినందున మండల స్థాయిలో పర్యవేక్షణ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏకీకృత కుటుంబ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేసి వివరాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
KRNL: తుగ్గలి మండల పరిధిలోనే రోల్లపాడు తండాలో విద్యుత్ వైర్లు తగిలి ఇవాళ రెండు ఆవులు మృతి చెందాయి. రోల్లపాడు తండాలోని ఒక వ్యవసాయ తోటలో ఉండే విద్యుత్ వైర్లకు రోల్లపాడు తండాకు చెందిన పాండు నాయక్‌కు సంబంధించిన రెండు ఆవులు తగలడంతో అక్కడికక్కడే రెండు ఆవులు మృతి చెందాయి. మృతి చెందిన ఆవులకు రూ. 80 వేల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.
CTR: పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కార్యాలయం పేరుతో ఫేక్ కాల్స్ నమ్మొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. కొంతమంది ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి అన్నదానం, వసతి ఏర్పాట్లు చూస్తామని, అదేవిధంగా ఉచిత శిక్షణ ఇస్తామని కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ASF: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ATP: అనంతపురం రూరల్ జనసేన ముఖ్య నాయకుడు గట్టు సుధాకర్ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో సోమవారం పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ సాకే పవన్ జనసేన శ్రేణులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
NZB: రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన నేపథ్యంలో ధన్పాల్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
SRD: హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ మైదానంలో జరిగిన సీఎం కాపు రాష్ట్ర యోగ పోటీలో సంగారెడ్డికి చెందిన మాధవి కాంస్య పతకం సాధించింది. కాంస్య పతకం సాధించినందున సంగారెడ్డి జిల్లా డివైఎస్ఓ అఖిలేష్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ రమేష్ లు అభినందనలు తెలిపారు.
అన్నమయ్య: బి.కొత్తకోట మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ BS లిషానందని తెలిపారు. 5వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, SC, ST విద్యార్థులు రూ.125 చెల్లించి ఈనెల 24 నుంచి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న పరీక్ష ఉంటుందన్నారు.
ADB: ఉట్నూరు మండలంలోని షాంపూర్ రోడ్డు ప్రమాద బాధితులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో మాట్లాడి బాధితులకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు.
VZM: రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈనెల 27 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. తొలి దశలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని, పెసలు క్వింటాకు రూ.8,768, మినుములు రూ.7,400 మద్దతు ధరగా ఉంటుందని, కొనుగోళ్లను ఏపీ మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా, ఎన్‌సీసీఎఫ్ ద్వారా నిర్వహిస్తారన్నారు.
ఈనెల 26న సూపర్-8 పోరులో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2022లో ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక జింబాబ్వే జట్టు భారత గడ్డపై భారత్‌తో చివరిసారిగా 2002లో తలపడింది.
SRCL: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్మికులు తరలివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు.
MBNR: పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువు పై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.