»Hundreds Of Girls Poisoned In Iran To Stop Them From Going To School
Crime : ఇరాన్ లో దారుణం… బాలికలపై విష ప్రయోగం..!
Crime : ఇరాన్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికలపై విష ప్రయోగం జరిగింది. అక్కడ బాలికలు చదువుకోకూడదనే కారణంతో వారిని చంపేయాలని చూశారు. వందల మంది బాలికలపై ఈ విష ప్రయోగం చేయడం గమనార్హం.
ఇరాన్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికలపై విష ప్రయోగం జరిగింది. అక్కడ బాలికలు చదువుకోకూడదనే కారణంతో వారిని చంపేయాలని చూశారు. వందల మంది బాలికలపై ఈ విష ప్రయోగం చేయడం గమనార్హం.
క్వామ్ సిటీలో కొందరు ఈ అమానుషానికి పాల్పడ్డారని ఇరాన్ డిప్యూటీ మంత్రి యోన్స్ పనాహి తెలిపారు. బాలికలకు విద్య అవసరం లేదని, స్కూళ్లను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. గత నవంబరు నుంచే అనేకమంది విద్యార్థినులు శ్వాస సరిగా తీసుకోలేక ఆసుపత్రి పాలయ్యారని ఆయన వెల్లడించారు.
టెహరాన్ కు దక్షిణాన ఉన్న ఈ సిటీలో విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్టు ఆయన నిర్ధారించారు. అయితే ఈ దారుణానికి పాల్పడినవారినెవరినీ అరెస్టు చేసినట్టు సమాచారం లేదని పనాహి పేర్కొన్నారు. విష ప్రయోగానికి కారణాలపై ఇంటెలిజెన్స్, విద్యాశాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి అలీ బహదూరీ వెల్లడించారు. ఇటీవలే ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ జఫర్ తెలిపారు.