»Medico Preethi Face Caste Abuse At Campus Says Her Sister
Preethi face caste abuse:కులం పేరుతో దూషించారు.. రాత్రి 11 గంటల వరకు పనిచేయించేవారు
Preethi face caste abuse:మెడికో ప్రీతి (Preethi) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆమె మరణానికి గల కారణాలను సోదరి (Preethi sister) మీడియాకు వివరించారు. క్యాంపస్‌లో ప్రీతికి (Preethi) కులం పేరుతో వేధించేవారని చెప్పారు. అలా ముగ్గురు వల్ల తన అక్క ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.
medico Preethi face caste abuse at campus says her sister
Preethi face caste abuse:మెడికో ప్రీతి (Preethi) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆమె మరణానికి గల కారణాలను సోదరి (Preethi sister) మీడియాకు వివరించారు. క్యాంపస్‌లో ప్రీతికి (Preethi) కులం పేరుతో వేధించేవారని చెప్పారు. అలా ముగ్గురు వల్ల తన అక్క ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు. ప్రీతిది (Preethi) 100 శాతం హత్యేనని.. సీనియర్లు అంతా కలిసి ప్రీతిని టార్గెట్ చేశారని తెలిపారు. కావాలనే వేధింపులకు గురిచేశారని.. కులం పేరుతో వేధించి.. తక్కువ చేసి చూశారని వాపోయారు.
తాము లంబాడీ (lambadi) కులానికి చెందినవారమని ఆమె సోదరి తెలిపారు. తమ కులాన్ని గొప్పగా చెప్పుకుంటామని చెప్పారు. కానీ ఈ కాలంలో కూడా కులం పేరుతో దూషించడం తగదని అంటున్నారు. క్యాంపస్‌లో కూడా కుల వివక్ష ఏంటో అర్థం కావడం లేదన్నారు. గుడిలో (temple), బడిలో (school) వివక్ష.. ఇంకెన్నాళ్లు అని అడిగారు. రాత్రి 11 గంటల (night 11) వరకు ఆస్పత్రిలో సీనియర్లు పనిచేయించేవారని గుర్తుచేశారు. పనిచేసే చోట బాత్ రూమ్ డోర్లకు తాళాలు వేసి.. ప్రీతికి ఇచ్చేవారు కాదని చెప్పారు. క్యాంపస్‌లో తనకు జరిగిన అవమానాలు అన్నింటినీ ప్రీతి తమకు చెప్పి బాధపడేవారు అని గుర్తుచేశారు. ఆమెను వేధించిన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో సైఫ్ ఏ1 అని మిగతా ఇద్దరినీ కూడా వదిలి పెట్టొద్దు అని చెప్పారు.
చదవండి:Medico Preethi కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండ.. ఏమేమి హామీలంటే..?
సీనియర్ల వేధింపులతో ప్రీతి (Preethi) ఆత్మహత్యాయత్నం చేసింది. మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు (nims) తీసుకొచ్చారు. ఇక్కడ ప్రీతికి (preethi) ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స ఇచ్చారు. ప్రత్యేక వైద్య బృందం ప్రీతికి జీవం పోసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. నిన్న రాత్రి ప్రీతి చనిపోయారని నిమ్స్ వైద్యులు ప్రకటన చేశారు.
కేఎంసీలో (kmc) పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ ఎంఎ సైఫ్ వేధింపుల వల్ల ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసిందని పోలీసులు అంటున్నారు. ప్రీతి- సైఫ్ వాట్సాప్ గ్రూప్ చాటింగ్‌లను పరిశీలించారు. వాట్సాప్ హిస్టరీ పరిశీలించిన తర్వాత వేధింపులకు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. సైఫ్‌ను (saif) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మేజిస్ట్రెట్ ముందు హాజరుపరచగా 14 రోజుల (14 days) రిమాండ్ (remand) విధించారని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ (ranganath) తెలిపారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని.. దాంతోపాటు ర్యాగింగ్ కూడా కలిపామని చెప్పారు. సైఫ్ కావాలనే ప్రీతిని టార్గెట్ చేశాడని వివరించారు.
సైఫ్ తరచూ ప్రీతిని (preethi) అవమానించడం, చులకన చేసి మాట్లాడటం వల్లే క్రితం ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించి.. ప్రాణాలను కోల్పోయంది. కేఎంసీలో అనస్థీషియా విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతిని సీనియర్ సైఫ్ పదే పదే కేస్ షీట్ విషయంలో నీకు బుర్రలేదంటూ అవమానించడం, వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్‌లు పెట్టి అవమానించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. సెన్సిటివ్ అయిన ప్రీతి.. సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టు వాట్సాప్ మెసేజ్ తన స్నేహితులకు పెట్టిందని వరంగల్ సీపీ తెలిపారు.