మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది (Meghalaya, Nagaland Assembly polls).
కళల (Arts)కు కాణాచిగా తెలంగాణ విలసిల్లుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోంది. ఎన్నో అద్భుత కళలకు నిలయంగా ఉన్న తెలంగాణ (Telangana)లో పేరిణి నృత్యం (Perini Dance) ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దైవ భక్తితో కూడిన ఈ నృత్యం చేయడం కత్తి మీద సాములాంటిది. భక్తితో పాటు నవరసాలను ఒలికించడం ఈ నృత్యం ప్రత్యేకత.
ఐఏఎస్ (IAS) కావాలన్న తన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు ప్రీతి నాయక్ (Preeti Nayak). ప్రీతి ఐఏఎస్ కావాలని భావించింది.
విదేశాంగ మంత్రి జైశంకర్ (S. Jaishankar) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు.
వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అండగా నిలబడింది. ఐదు రోజుల పాటు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ప్రీతిని కాపాడేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి మృత్యువుతో పోరాడలేక ప్రీతి కన్నుమూసింది. ర్యాగింగ్ ధాటికి ప్రాణం కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది.
మెడికో ప్రీతి(Preeti) ఆదివారం రాత్రి 9.16 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్(NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలె మెడికో ప్రీతి(Preeti) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెను హైదరాబాద్ నిమ్స్(NIMS)లో చేర్చి చికిత్స అందిస్తుండగా నేడు కన్నుమూసింది. ఆదివారం సాయంత్రం వరకూ కోలుకుంటోందని చెబుతూ వచ్చిన వైద్యులు సాయంత్రం తర్వాత పరిస్థితి విషమించినట్లు తెలిపారు.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కే విశ్వనాథ్(K Vishwanath) ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి(Jayalakshmi) కన్నుమూశారు. ఆదివారం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మద్యం లిక్కర్ కేసు(Liquior Case)లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేసి ప్రత్యేక కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ని సీబీఐ అధికారులు పలు విధాలుగా విచారిస్తున్నారు. మనీశ్ సిసోడియా(Manish sisodia) మీడియాతో మాట్లాడుతూ..తనను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు. అందుకే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా మళ్ల...
గుజరాత్(Gujarat)లో ఆదివారం భూమి కంపించింది. భూకంపం(Earthquake) రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ భూకంప(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3.21 గంటలకు గుజరాత్ లో భూ ప్రకంపనలు(Earthquake) వచ్చినట్లు నేషనల్ సెంటర్ సిస్సోలజీ సంస్థ తెలిపింది. గుజరాత్ లోని రాజ్ కోట్ కు సమీపంలో ఈ భూపంకం(Earthquake) సంభవించిందని అధికారులు వెల్లడించారు.
ప్రతినెలా కొన్ని నిబంధనలు(Rules) మారుతుండటం గత కొన్ని నెలలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్(Banking), గ్యాస్ సిలిండర్, ఇన్‌కమ్ ట్యాక్స్(Income tax), ఈపీఎఫ్ఓ(EPFO) వంటి వాటిలో నిబంధనలు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. మార్చి నెల రాబోతున్న నేపథ్యంలో వినియోగదారుల(Users)పై కొన్ని అదనపు భారాలు పడే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెల(March Month)లో మారే నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
టీడీపీ(TDP) నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తనపల్లి వద్ద పాదయాత్ర(Paadayatra) కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన లెవల్ కాజ్ వే(Causeway)ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. 2021 నవంబర్‌లో వరదల వల్ల స్వర్ణముఖి(Swarnamukhi) నదిపై ఉన్న లెవల్ కాజ్ వే(Causeway)లు కొట్టుకుపోయాయని స...
తన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్లాపుల గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. అందుకు 100 శాతం పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. ప్లాపులు తనకు కొత్త ఏం కాదని పేర్కొన్నాడు. ఒక దశలో వరుసగా 8, 16 చిత్రాలు హిట్టు కాలేదని గుర్తు చేశారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం తాజాగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. నిధుల లేమి కారణంగా మార్చి 9న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద కేవలం 500 మిలియన్ డాలర్ల విదేశీ మారకం మాత్రమే ఉండటంతో శ్రీలంక ప్రస్తుతం నిధుల కొరతతో ఇక్కట్ల పాలవుతోంది.
తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశం కోసం నడిచానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. యాత్రలో భాగంగా తాను వేలాది మంది ప్రజలు, రైతుల సమస్యల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లో పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.