»Adani And Modi Are The Same Rahul Gandhi Have I Learned A Lot In Jodo Yatra Raipur
Rahul Gandhi: అదానీ, మోదీ ఒక్కటే..జోడో యాత్రలో చాలా నేర్చుకున్నా
తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశం కోసం నడిచానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. యాత్రలో భాగంగా తాను వేలాది మంది ప్రజలు, రైతుల సమస్యల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాయ్‌పూర్‌లో పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు అదానీని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంట్లో బిలియనీర్ గౌతమ్ అదానీ(adani)కి బీజేపీ(bjp) నేతలు ఎందుకు అండగా నిలుస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఆరోపించారు. ప్రధాని మోదీ, అదానీ ఒక్కటేనని ఛత్తీస్‌గఢ్(chhattisgarh) రాయ్‌పూర్(raipur)లో జరుగుతున్న పార్టీ 85వ ప్లీనరీ సమావేశం(85th plenary meetings)లో భాగంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటు(parlament)లో అదానీ గురించి ఎవరూ ప్రశ్నలు అడగలేదని, నిజం బయటకు వచ్చే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని రాహుల్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్త అదానీపై అమెరికా(america)కు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్(hindenburg research) చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని పార్లమెంటులో కోరినట్లు తెలిపారు. ఆ క్రమంలో తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. అసలు ఆ విచారణ గురించి మాట్లాడలేదన్నారు. అదానీ స్నేహితుడు కాకపోతే, విచారణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. రక్షణ రంగంలోని షెల్ కంపెనీలు, బినామీ డబ్బుపై కూడా విచారణ జరగలేదన్నారు. కానీ ప్రధాని దానిపై ఏమీ మాట్లాడకపోగా…అతన్ని రక్షిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు.
మరోవైపు భారత్ జోడో యాత్ర(bharat jodo yatra)లో తాను చాలా నేర్చుకున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. కన్యాకుమారి(kanyakumari) నుంచి కశ్మీర్(kashmir) వరకు నా దేశం కోసం నడిచానని అన్నారు. యాత్రలో భాగంగా తనకు వేలాది మంది కనెక్ట్ అయ్యారని గుర్తు చేశారు. దీంతోపాటు అనేక మంది ప్రజలు, రైతుల సమస్యలతోపాటు వారి బాధలను కూడా తెలుసుకున్నానని చెప్పారు. భారత్ జోడో యాత్రకు ఊహించని మద్దతు లభించిందని..యాత్ర మొదలు పెట్టాక తనలో చాలా మార్పులు వచ్చాయని రాహుల్ గాంధీ(rahul gandhi) స్పష్టం చేశారు. మరోవైపు తనకు 52 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ తనకు ఇల్లు లేదన్నారు. కానీ కశ్మీర్‌కు చేరుకున్నప్పుడు, అది ఇల్లులా అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని కులాలు, వయోవర్గాల ప్రజలు తమ ఇంటిలో ఉన్నారని భావించేలా ఈ యాత్ర సాగిందని పేర్కొన్నారు.
During Bharat Jodo Yatra I learned a lot. I walked for my nation from Kanyakumari to Kashmir. Thousands connected to me & party during the yatra. I listened to all problems of farmers & realized their pain: Cong MP Rahul Gandhi at 85th Plenary Session of party in Raipur pic.twitter.com/pmhptf7uPB
ఛత్తీస్‌గఢ్(chhattisgarh)రాజధాని రాయ్‌పూర్(raipur)లో 85వ కాంగ్రెస్(85th plenary meetings) సెషన్ చివరి రోజున రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రసంగించారు. లాల్ చౌక్‌లో 15-20 మంది బీజేపీ(BJP) కార్యకర్తలతో ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని పేర్కొన్నారు. అయితే తాను మాత్రం ఇదే లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు తనతో వేలాది మంది ప్రజలు ఉన్నారను గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ చైనా కంటే చిన్నదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(jai shankar) ఒక ఇంటర్వ్యూలో చెప్పారని కాంగ్రెస్(congress) ఎంపీ(mp) రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కాబట్టి మనం వారితో ఎలా పోరాడగలం? మనం బ్రిటిష్ వారితో పోరాడుతున్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ(pm modi) ఎన్నికల సమయంలో ప్రజలకు సంబంధం లేని అంశాలు లేవనెత్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(priyanka gandhi vadra) ఆరోపించారు. నిరుద్యోగాన్ని ఎలా ఎదుర్కోవాలి, జీడిపి(GDP)ని ఎలా బలోపేతం చేయాలి, మన ఆర్థిక వ్యవస్థను వంటి అంశాలను పట్టించుకోలేదని విమర్శించారు. దీంతోపాటు బీజేపీ(BJP) తమ కార్యకర్తలపై దాడి చేసిందని గుర్తు చేశారు. కార్యకర్తలందరూ సమిష్టిగా పార్టీ కోసం కృషి చేయాలని కోరారు. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మళ్లి కార్జున్ ఖర్గే(mallikarjun kharge) ముగింపు ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత పలువురు నేతలు ప్రసంగించనున్నారు.