nara lokesh:జబర్దస్త్ ఆంటీ దర్శన టికెట్లను..జగన్‌ది GO తనది PO అంటోన్న నారా లోకేశ్
nara lokesh on roja:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చంద్రగిరి (chandragiri) నియోజకవర్గంలో కొనసాగుతోంది. తొండవాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విజయనగరం సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన గడ్డ చంద్రగిరి (chandragiri) అని పేర్కొన్నారు.
nara lokesh on roja:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చంద్రగిరి (chandragiri) నియోజకవర్గంలో కొనసాగుతోంది. తొండవాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విజయనగరం సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన గడ్డ చంద్రగిరి (chandragiri) అని పేర్కొన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ల్యాండ్ (land), శాండ్ (sand), వైన్ (wine), మైన్ (mine), ఎర్రచందనం మాఫియా పేట్రెగిపోతోందని మండిపడ్డారు. సీఎం జగన్ (jagan), మంత్రి రోజా (roja) లక్ష్యంగా విమర్శలు చేశారు. పాలకమండలి సభ్యుల పదవులను సీఎం జగన్ (jagan) అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బబర్దస్త్ ఆంటి రోజా (roja) అయితే ఏకంగా తిరుమల దర్శనాన్ని అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఆమెతోపాటు మంత్రి నారాయణ స్వామి (narayana swamy), తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి (karunakar reddy) పాత్ర కూడా ఉందన్నారు. దేశంలో వివిధ చోట్ల టీటీడీకి ఉన్న ఆస్తులను అమ్మేయాలని జగన్ కుట్ర చేశారని లోకేశ్ ఆరోపించారు.
పవిత్ర పుణ్యస్థలం తిరుపతిలో (tirupati) గంజాయి (ganja) దొరకడం ఏమిటని అడిగారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా వివేకానంద హత్యతో (vivekananda) సంబంధం లేదని ప్రమాణం చేయాలని సీఎం జగన్‌కు (jagan) సవాల్ విసిరారు. రాయలసీమకు పట్టిన శని జగన్ (jagan) అని లోకేశ్ (lokesh) విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కడితే రాయలసీమ రాళ్ల సీమవుతుందని అన్నారు. వైసీపీ ఎంపీలు మాత్రం ఢిల్లీలో నోరు మెదపరు అని మండిపడ్డారు.
చదవండి:Nara Lokesh: తనపల్లిలో నారా లోకేష్‌కు తమ సమస్యలు తెలిపిన ప్రజలు
తన మైక్ లాగేందుకు జగన్ (jagan) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని లోకేశ్ (lokesh) ఆరోపించారు. తన మైక్ స్వచ్చందంగా సరెండర్ చేస్తానని.. మరీ ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇస్తావా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తావా? 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పెన్షన్ ఇస్తారా అని అడిగారు. జగన్ (jagan) జలగ లాంటి వాడని.. జలగ రక్తం పిల్చినట్టు.. వస్తువుల ధరలు పెంచి జనం రక్తం పిలుస్తున్నాడని ఆరోపించారు. జగన్ (jagan) అధికారం చేపట్టిన వెంటనే బోటు ప్రమాదం జరిగిందని గుర్తుచేశారు. 51 మంది (51 people) నిండు ప్రాణాలు బలయ్యాయని చెప్పారు. ఎల్జీ పాలిమార్ ఘటనలో 10 మంది, అన్నమయ్య డ్యామ్‌లో 62 మంది కొట్టుకుపోయారని చెప్పారు.
సీఎం జగన్‌ది (jagan) గవర్నమెంట్ ఆర్డర్.. తనది పబ్లిక్ ఆర్డర్ అని లోకేశ్ (lokesh) స్పష్టంచేశారు. జగన్ గవర్నమెంట్ ఆర్డర్‌తో (go) తనను ఆపాలని చూస్తున్నారని.. పబ్లిక్ ఆర్డర్ (po) మాత్రమే తాను గౌరవించి మీ వద్దకు వస్తున్నానని తెలిపారు. జీవోతో తన వద్ద వందలాది పోలీసులు (police), వజ్ర వాహనం, ఇంటెలిజెన్స్ వాళ్లను తిప్పుతున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతియేటా 6500 పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ నెరవేరిస్తే తన సౌండ్ వెహికల్స్ స్వచ్చందంగా ఇచ్చేస్తానని లోకేశ్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న 4 సరెండర్లు, 8 టీఏ, డీఏ బిల్లులు, మెడికల్ బిల్లులు ఇచ్చేస్తే తన స్టూల్ జగన్ రెడ్డికి ఇచ్చేస్తానని లోకేశ్ తెలిపారు.