KTR : ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను దాదాపు 8గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు.... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను దాదాపు 8గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు…. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని కేటీఆర్ అన్నారు. సిసోడియా అరెస్టును బీఆర్ఎస్ ఖండిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలపై బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని..కేంద్రం ఆధీనంలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి బీజేపీ దొంగచాటు రాజకీయాలను చేస్తుందని అన్నారు. ప్రజాబలం లేని అధికారం రాలేని ప్రాంతాల్లో కేంద్రం ఏజెన్సీలను అడ్డుపెట్టుకొని బలహీనపరిచే కుట్రలో భాగంగానే సిసోడియా అరెస్ట్ జరిగిందని అన్నారు.
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టులో చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకే ఇప్పుడు సిసోడియాను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ అసమర్ధ పాలనను..అవినీతిని ప్రశ్నిస్తున్న పార్టీలను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ కుట్ర చేసి భంగపడింది. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారన్నారు. బీజేపీ దుర్మార్గాలకు కా