kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) నెక్ట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేత వివేక్ అన్నారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి కవిత అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం ఆప్‌కు కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పదకొండవ శతాబ్ధం నాటికే కాకతీయుల కాలంలో...
love harassment to rakshita:మెడికో ప్రీతి మృతి వీడకముందే ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కలకలం రేపింది. తొలుత రక్షిత కూడా ర్యాగింగ్ వల్లే చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ర్యాగింగ్ వల్ల చనిపోలేదని.. రాహుల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని తెలిసింది.
నెటిజన్లు ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ, ఆమెకు న్యాయం చేయాలంటూ '#JusticeForDrPreethi' అంటూ ట్వీట్ చేస్తున్నారు. భారత సమాజం ఆమెకు న్యాయం జరగాలని ఎంతలా కోరుకుంటుందంటే... అందుకు '#JusticeForDrPreethi' టాప్ ట్రెండింగ్ లో నిలవడమే నిదర్శనం.
Crime : ఇరాన్ లో దారుణం చోటుచేసుకుంది. బాలికలపై విష ప్రయోగం జరిగింది. అక్కడ బాలికలు చదువుకోకూడదనే కారణంతో వారిని చంపేయాలని చూశారు. వందల మంది బాలికలపై ఈ విష ప్రయోగం చేయడం గమనార్హం.
arvind Kejriwal:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని చాలా మంది సీబీఐ అధికారులు వ్యతిరేకిస్తున్నారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కేంద్రమంత్రి (Union Minister), బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ఆదివారం కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని, టాలీవుడ్ సూపర్ స్టార్ (Nagarjuna)ను కలిశారు. హైదరాబాద్ (Hyderabad) లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.
KTR : ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను దాదాపు 8గంటల పాటు విచారించిన సీబీఐ అధికారులు.... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్ని పథ్ స్కీమ్ పైన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ స్కీమ్ చెల్లుబాటును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ఈ అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్నిసవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం అమలు చేస్తున్న...
Preethi face caste abuse:మెడికో ప్రీతి (Preethi) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆమె మరణానికి గల కారణాలను సోదరి (Preethi sister) మీడియాకు వివరించారు. క్యాంపస్‌లో ప్రీతికి (Preethi) కులం పేరుతో వేధించేవారని చెప్పారు. అలా ముగ్గురు వల్ల తన అక్క ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.
దివంగత వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తనయుడు వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) తెలుగు దేశం పార్టీకి (Telugu Desam) షాకివ్వనున్నారా? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన (Jana Sena) పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఆలయ పాలక మండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ ఉత్సవాల సందర్భంగా భారీ భక్తులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
Pawan Kalyan : మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు పోరాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. నేడు ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మద్యం కుంభకోణంలో (liquor Scam) ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Delhi Deputy Chief Minister) మనీష్ సిసోడియాను (Manish Sisodia) అరెస్ట్ చేశారు. ఆయన పలు ఫోన్లను మార్చడం మొదలు... ఫైల్స్ డిలీట్ చేసే వరకు ఎన్నో వెలుగు చూశాయి. దీంతో సీబీఐ (CBI) అతనిని అరెస్ట్ చేసింది. ఆయన్ను సోమవారం న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.
Bandi Sanjay : మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి... వరంగల్ మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి లో శిక్షణ తీసుకుంటుండగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడు. ఆ వేధింపులకు తాళలేక ప్రీతీ ఆత్మహత్య కు పాల్పడింది. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు వొదిలేసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం పై విమర్శలు వెల్లు...