E.G: నిడదవోలు బాలికల ఉన్నత పాఠశాలలో నెస్లే సంస్థ CSR నిధులతో నిర్మించిన శానిటేషన్ బ్లాక్‌ను మంత్రి కందుల ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు మౌలిక వసతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ.. నెస్లే సంస్థ సామాజిక బాధ్యతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
MLG: గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారిందని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేదని CM విమర్శించారు.
SKLM: గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నియంత్రించాలని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మండల పరిషత్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆదివారం పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం పలువురు మద్యం దుకాణాల్లో సిండికేట్లు ఇష్టారాజ్యముగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తపరిచారు.
AP: తానెప్పుడూ టెక్నాలజీని ప్రమోట్ చేస్తానని CM చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తపాలాశాఖ ద్వారానే జరిగేవన్నారు. కాలక్రమంలో టెలికాం రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. ఎంత సాంకేతికత వచ్చినా గ్రామీణ డాక్ సేవక్‌ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. దేశంలో 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవక్‌లు ఉన్నారని పేర్కొన్నారు.
BPT: వైసీపీ అబద్ధాల పునాదుల మీద పుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గత పాలకుడు రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. కౌన్సిల్ హాల్‌లోకి చెప్పులు, దేవుడి ఫోటోలతో వచ్చి వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
PLD: చిలకలూరిపేట మండలం రాజాపేటలో ఆదివారం జరిగిన మహా కూటములకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. దేవుని వాక్యంతో ప్రజల కష్టాలు తొలగి, రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను, వర్గాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పేదల ఆరోగ్యం, సంతోషం కోసం ప్రార్థనలు నిర్వహించారు.
కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దునే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం మోడ్రన్ విద్యాసంస్థల అధినేత జీవీ రావుని కలిసి విద్యార్థులకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన్ కీ బాత్ ప్రతి ఒక్కరూ వీక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ పాల్గొన్నారు.
అనంతపురం నగరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఘనంగా నిర్వహించారు. లలిత కళాపరిషత్ నుంచి విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
AP: తాము చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేమని CM చంద్రబాబు అన్నారు. తమ చిన్నప్పుడు అన్నింటికీ పోస్ట్‌మ్యాన్‌పైనే ఆధారపడే వాళ్లమని తెలిపారు. జ్యోతిరాదిత్య.. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్నారని చెప్పారు. వాజ్‌పేయీ హయాంలో గ్వాలియర్ రాజమాతతో కలిసి పనిచేశామన్నారు. మాధవరావు సింధియాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసాయన పరిశ్రమలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చౌటుప్పల్, పోచంపల్లి మండలాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాలుష్యంతో ఇప్పటికే నరకం చూస్తున్న జనం, ఇప్పుడు ఈ పేలుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో సుమారు 150 వరకు రసాయన పరిశ్రమలు ఉన్నాయి.
TG: రూ. 6వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన దేవాదుల ఇవాళ రూ.18 వేల కోట్లు అవసరమైన స్థితికి చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేసి అన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కాళేశ్వరం కింద నీరు ఎత్తిపోయనప్పటికీ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి వస్తోందన్నారు.
పవర్‌ప్లేలో మా ఆట తీరు బాగుందని కెప్టెన్ సూర్య అన్నాడు. ‘మేము 40-50 పరుగులు చేస్తున్నాం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చాలా బాగా ఆడాం. మాపై ఇతరులకు అంచనాలు ఉండటం సహజం. ప్రతి మ్యాచ్‌లోనూ 220 – 250 పరుగులు చేయాలని ఆశిస్తుంటారు. కానీ ఇక్కడి పిచ్‌లు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు మేము ఆడిన నాలుగు పిచ్‌లు సవాలుతో కూడుకున్నవిగా ఉన్నాయి’ అని పేర్కొన్నాడు.
ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికైన డాక్టర్ అనిత రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదివారం తెలిపారు. శ్రామిక ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న అనిత బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 28వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన అనిత ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తానన్నారు.
SRPT: నేరేడుచర్ల మండలం బూరుగుల తండా గ్రామంలో గిరిజన ఆరాధ్యదైవం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి సర్పంచ్ నాగు ,ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.
KMM: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఏదులాపురం సత్య నారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహప్రవేశ వేడుకకు ఆదివారం మంత్రి హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.