ఏలూరు నగరంలోని పలు కాలేజీలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని సూచించారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో సోమవారం అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు.భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల అమ్మకాల పరిస్థితిపై ఆరా తీశారు. చేనేత ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారుల స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు ప్రోత్సాహం అందించారు.
KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
KNR: చొప్పదండి ఎంపీపీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. ఈనెల 23 నుంచి 27 వరకు ఆర్నకొండ, భూపాలపట్నం, చాకుంట, దేశాయిపేట, పెద్ద కురువపల్లి, మంగళపల్లి, రాగంపేట, రేవెల్లి, మార్చి 2 నుంచి మార్చి 7 వరకు చిట్యాలపెళ్లి, గుమలాపూర్, కాట్నపల్లి, కొలిమికుంట, రుక్మాపూర్ వారికి శిక్షణ ఉంటుందన్నారు
ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం నూతన సర్పంచుల సంఘం కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ కృష్ణ నాయక్, అధ్యక్షురాలు నీలిమ, ఉపాధ్యక్షులు వెంకటరం, మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సభ్యులను ఎన్నుకున్నారు. దీంతో పలువురు వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.
MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.
ATP: జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు పరీక్షకు మొత్తం 22,848 మంది విద్యార్థులు కేటాయించబడగా, వారిలో 22,213 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 635 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు డాక్టర్లు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.
NRML: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగి ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థ దశకు చేరుతున్న అధికారులు స్పందించడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు.
VKB: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నమోదైన కేసులో భాగంగా హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ఏడు మంది అనుచరులతో పాటు తాండూర్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈమేరకు పట్టణ సీఐ ముందు షూరిటీలు సమర్పించిన సమయంలో పైలెట్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హల్‌చల్ చేశారు.
కోనసీమ: కొత్తపేట మండలం బిల్లకుర్రు గ్రామానికి చెందిన ఇళ్ల దేవి శ్రీ గత కొన్ని రోజులుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ వైజాగ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్య చికిత్సకు ఆమె కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కామన్ మ్యాన్ సేవాదళ్ సభ్యులు స్పందించిన వెంటనే ఆమె కుటుంబాన్ని పరామర్శించి పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
SDPT: కుమ్మేర మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన 8 మందిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు.
WNP: వనపర్తి పట్టణ పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో చెత్తాచెదారం, మురుగు నీరు పేరుకుపోవడంతో పందుల సంచారం, దోమల బెడద ఎక్కువైందని పట్టణ ప్రజలు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మళ్లీ పిండాలు పెట్టే సమయం వచ్చిందని మాజీ MLA రాజయ్య అన్నారు. పంటలు ఎండిపోతుంటే రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. హరీష్ రావు దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలిస్తే.. వెంటనే రేవంత్ దేవాదుల సందర్శనకు వచ్చేశారని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రులు, MLAల మధ్య పొంతనలేదన్నారు.