TG: మాజీమంత్రి హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. HYD బండ్లగూడ జాగీర్‌లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులను హరీష్ రావు తప్పుదోవ పట్టించారని విమర్శించారు. గత ప్రభుత్వం కమీషన్లు దండుకోవడం కోసం చేసిన పనికి అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాళా మీద మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు పర్మిషన్ తీసుకున్నారని ఆగ్రహించారు.
HNK: హనుమకొండ నగరం లోని సర్క్యూట్ హౌస్‌లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖను ఆదివారం పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ సర్పంచ్ తొర్రి పద్మకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపల్లి ఎల్లయ్య ఎన్నిక కావడంతో సింగరేణి కార్మికులు వారిని ఘనంగా సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.
SKLM: నరసన్నపేట మండలం గోపాలపెంట గ్రామానికి చెందిన బబ్బోది పెంటమ్మ, బుడుమూరు అమ్మడమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆదివారం వారిరువురిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు ఎంపీటీసీ మల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో బైక్ ప్రమాదానికి గురైన వైసీపీ నాయకుడు ఈరప్పను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్య చికిత్సల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: ఆత్మకూరు మండల ప్రభుత్వ వైద్యశాలలో ఓ మహిళ ఇద్దరు కవల పిల్లలను జన్మనిచ్చారు. మర్రిపాడు మండలం చిన్నమాచనూరు గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ తొలి కాన్పులో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. నేడు ప్రపంచ కవలల దినోత్సవం కావడంతో ఆమెకు ఈ విషయం తెలుపగా.. ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టడం లక్ష్మీదేవి పుట్టినట్టుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు జింబాబ్వే చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేస్తోందని కొనియాడాడు. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నాడు. ఫైనల్లో భారత్ vs జింబాబ్వే జట్లు తలపడితే చూడాలని ఉందని ద్రవిడ్ ఆకాంక్షించాడు.
NDL: పగిడ్యాల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్య గిత్త జయసూర్య ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్ర సిబ్బంది హాజరు పట్టి రిజిస్టర్ పరిశీలించారు. మహిళల ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బంది ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ జరిగింది. బాలిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 35 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి ఆభరణాలను దుండగులు అపహరించారు. శనివారం బంధువుల కార్యక్రమానికి కుటుంబంతో కలిసి పెనికలపాడు గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పక్కింటి వారు వాకిలి తెరిచి ఉందని సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులో వచ్చింది.
NLG: నల్లగొండలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌కే హాస్పిటల్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. సామాన్యులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య పాల్గొన్నారు.
NZB: బుస్సాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధోనీ పోశెట్టి (56) అనే వ్యవసాయ కూలీ మృతి చెందారు. నిన్న సాయంత్రం పని ముగించుకుని భైక్‌పై వస్తుండగా, యూ-టర్న్ వద్ద నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన పోశెట్టిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి మాజీ సర్పంచ్ చోడిపిల్లి బంగారి రూ.1,11,101 విరాళం ప్రకటించారు. ఈ మేరకు విరాళాన్ని నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ నిర్వాహకులకు అందజేశారు. విరాళం అందజేసిన మాజీ సర్పంచ్‌ను మంత్రి అభినందించారు.
SRCL: ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వడమే తమ లక్ష్యమని MLA అన్నారు.
విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) శ్రీ కె. రామారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బెడ్ షీట్లు, శుభ్రతను పరిశీలించి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సిబ్బంది, సూపర్వైజర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన కౌన్సెలింగ్లో సేవా ప్రమాణాలు పెంచాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటి పోలీస్ కార్యాలయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.