• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీ వాసుదేవ పెరుమాళ్లు స్వామి సేవలో టీడీపీ నేతలు

SKLM: మందసలో వెలసిన శ్రీ వాసుదేవ పెరుమాళ్లు స్వామి వారిని పలాస టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, స్థానిక నాయకులుతో కలిసి స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు నాగ రాజు తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 11:40 AM IST

పేద యువతికి ఆర్థిక సాయం అందజేత

ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన సిరిచాటి రవి, నాగరత్నమ్మ కుమార్తె నవనీత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని  పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 22, 2026 / 11:40 AM IST

‘జంగారెడ్డిగూడెం వైజాగ్ తో పోటీ పడే సత్తా ఉంది’

ELR: జంగారెడ్డిగూడెం పట్టణం విశాఖపట్నంతో పోటీపడే సత్తా ఉందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం కూడా పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆదాయం పెంచే విధంగా ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. దీంతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.

February 22, 2026 / 11:36 AM IST

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన మండల విద్యార్థిని

నిర్మల్: కడెం మండలం అల్లంపెల్లిలోని జీయర్ గురుకులం విద్యార్థిని గోపు నిహారిక ఆర్చరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించింది. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి ‘సీఎం-కప్’ అర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

February 22, 2026 / 11:36 AM IST

మాజీ ఎమ్మెల్యేకు ఏసీబీ షాక్

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల వ్యవహారంలో గతంలో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదులపై సరైన సాక్ష్యాధారాలు లేవని సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో, ఈనెల 27న విజయవాడ ఏసీబీ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

February 22, 2026 / 11:35 AM IST

క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్

ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు-2026 పేరిట ఐటీ శాఖ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఒక ఆర్థిక ఏడాదిలో క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయి. అలాగే రూ.లక్ష, అంత కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసినా వివరాలు అందిస్తాయి. దీందో ఖర్చుచేసే వారిపై ఐటీ శాఖ నిఘా పెరుగుతుంది.

February 22, 2026 / 11:35 AM IST

కొమ్మాల ఆలయ డైరెక్టర్‌గా వినయ్

WGL: కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన డైరెక్టర్‌గా ఆరేపల్లి హవేలీ గ్రామానికి చెందిన దుకిరే వినయ్ కుమార్ నియమితులయ్యారు. రేపటి నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 11:35 AM IST

‘ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు’

MDK: ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని అభిప్రాయ భేదాలు ఉంటే చట్టబద్ధమైన, శాంతియుత మార్గాల్లో వ్యక్తపరచాలని MP రఘునందన్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతిస్తాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

February 22, 2026 / 11:35 AM IST

ఈ నెల 28తో ఫార్మర్ రిజిస్ట్రేషన్ గడువు ముగింపు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు గడువు ఈ నెల 28తో ముగియనుంది. రైతులు తప్పనిసరిగా గడువు లోపే నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూచించారు. జిల్లాలో మొత్తం 3,02,563 మంది పాస్ పుస్తకాలు కలిగిన రైతుల్లో 1,82,282 మంది రైతులు మాత్రమే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

February 22, 2026 / 11:33 AM IST

రేపటి ప్రజావాణి యదాతదం

KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 11:32 AM IST

రేపటి ప్రజావాణి యథాతథం

KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 11:32 AM IST

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

NGKL: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఒక వరమని సర్పంచ్ భీమయ్య అన్నారు. కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కంఠం బాల్ చెన్నయ్య కు మంజూరైన రూ. 27000 విలువైన చెక్కును సర్పంచ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారు ప్రభుత్వం అందించే ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 11:30 AM IST

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ, ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

February 22, 2026 / 11:30 AM IST

‘ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలి’

E.G: ప్రభుత్వం CPSను రద్దు చేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలని గోపాలపురం ASO జోడాల వెంకట్ కోరారు. CPS రద్దుకై విశాఖలో ఆదివారం జరుగుతున్న దీక్షకు గోపాలపురం నుంచి CPS ఎంప్లాయిస్ రాష్ట్ర సంఘ సెక్రటరీ రొయ్యల నాగ దుర్గారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శాంతి, తదితరులు వెళ్లారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

February 22, 2026 / 11:30 AM IST

ఆరు సార్లు ఎంపీగా గెలిచిన మహోన్నత వ్యక్తి బొడ్డేపల్లి

SKLM: శ్రీకాకుళంలోని సింహద్వారం వద్ద ఉన్న స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజగోపాల్ రావు రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి త్వమని కొనియాడారు. వరుసగా ఆరు పర్యాయాలు శ్రీకాకుళం ఎంపీగా సేవలందించారని.

February 22, 2026 / 11:28 AM IST