• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్

GNTR: గ్రామపంచాయతీ కార్మికులకు జీతాల పెంపు, 132, 142, 680 జీవోలను తక్షణమే అమలు , టెండర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిరంగిపురంలో మంగళవారం కరపత్రాన్ని విడుదల చేశారు.

February 23, 2026 / 04:32 PM IST

‘ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం’

SRCL: ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

February 23, 2026 / 04:32 PM IST

సాక్షి, భారతి సిమెంట్స్‌కు రూ.వెయ్యి కోట్ల లబ్ధి: లోకేష్

AP: వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ రూ.వెయ్యి కోట్లు లబ్ధి పొందాయని మంత్రి లోకేష్ ఆరోపించారు. తాము ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని తెలిపారు. మార్కెట్‌లో కిలో నెయ్యి రూ.వెయ్యి పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్‌కు కో కంపెనీ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

February 23, 2026 / 04:31 PM IST

‘కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి’

VKB: కుల్కచర్ల ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల ఇంఛార్జ్ MEO రామ్ చందర్ అన్నారు. మండలంలోని ముజాహిద్పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించారు. విద్యార్థులకు సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా బోధన చేయాలన్నారు. FLSను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.

February 23, 2026 / 04:31 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

KMR: కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి సోమవారం పదవీ బాధ్యత స్వీకరించారు. ఈ తరుణంలో కామారెడ్డి ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఫోన్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. “రావాల్సింది ఉండే కానీ రాలేకపోయాను. మంత్రితో మీటింగ్ ఉండడం వలన రాలేకపోయాను” అని ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి ఛైర్ పర్సన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 04:31 PM IST

పెద్దాయపల్లి భూమి ఆక్రమంపై ఫిర్యాదు

MBNR: బాలానగర్ (M) పెద్దాయపల్లి సర్వే నం.78లో ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్ ఆక్రమించిందని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్ 7న ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 04:30 PM IST

కోడి పందేల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కృష్ణా: ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ వి. చందన తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోడి పుంజు, రూ.1,67 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 04:30 PM IST

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. వివిధ అభివృద్ధి పనులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

February 23, 2026 / 04:29 PM IST

జిల్లాలో పశువుల హాస్టళ్లు

సత్యసాయి: పాడి రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ‘కమ్యూనిటీ అనిమల్ హాస్టళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, పరిగి, సోమందేపల్లి, అమరాపురంలో ఐదు యూనిట్లను మంజూరు చేశారు. ఒక్కో హాస్టల్‌ను రూ.10 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో 20 పశువులకు వసతి కల్పిస్తారు.

February 23, 2026 / 04:28 PM IST

ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించారు. భూమి, పెన్షన్లు, ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేసి ఆదేశించారు.

February 23, 2026 / 04:27 PM IST

పాఠశాలలోకి దూసుకెళ్లిన వ్యాన్.. తప్పిన ముప్పు

ASR: జీకేవీధి మండలం కస్తూర్బా గాంధి పాఠశాలలోకి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆ పనులకు సోమవారం ఉదయం ఇసుక తీసుకువచ్చిన వ్యాన్ అదుపుతప్పి గోడ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ విరిగి వాహనం బోల్తా పడింది.

February 23, 2026 / 04:27 PM IST

టీమిండియాలో భారీ మార్పులు..!

T20 WC సూపర్-8లో భాగంగా ఈనెల 26న జింబాబ్వేతో భారత్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌ కోసం భారత్ తుది జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. అలాగే, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే, ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసినట్లే.

February 23, 2026 / 04:27 PM IST

అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

కడప: నగరంలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో అనుమానిత ప్రాంతాల్లో నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. స్పెషల్ పార్టీలతో అనుమానితులను గుర్తించే చర్యలు వేగవంతం చేశారు.

February 23, 2026 / 04:26 PM IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 443 అర్జీలు

TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో మొత్తం 443 అర్జీలు అందాయి. వచ్చిన ప్రతి అర్జీకి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ వారి సమస్యలను స్వయంగా స్వీకరించారు.

February 23, 2026 / 04:26 PM IST

వార్డు మెంబర్లకు రెండవ విడత శిక్షణ ప్రారంభం

NLG: చిట్యాల మండలంలోని జీపీ వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణా తరగతులు గుండ్రాంపల్లి రైతు వేదికలో ఇవాళ ప్రారంభమయ్యాయి. 20వ వరకు జరిగే శిక్షణకు ఆరెగూడెం, గుడ్రాంపల్లి, సుంకేనేపల్లి, వెలిమినేడు, ఏపూరు, బొంగోనిచెరువు, పిట్టంపల్లి, పేరేపల్లి, పెద్దకాపర్తికి చెందిన 90 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీవో కోటేష్,యూసుఫ్ పాల్గొన్నారు.

February 23, 2026 / 04:25 PM IST