జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 20 ఓవర్లలో ఏకంగా 254/6 పరుగులు బాదారు. దీంతో 2026-T20 WC చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. అలాగే, T20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు నమోదు చేసింది. 260/6 పరుగులతో శ్రీలంక (vs కెన్యా, 2007) తొలి స్థానంలో కొనసాగుతోంది.
TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
HNK: జిల్లాలోనిలోని GP కార్మికుల పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఇవాళ ప్రగతిశీల GP వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో (HNK) డీపీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు నరసింహారావు మాట్లాడుతూ.. GP అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల వేతనాలు రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.
RR: భగవద్గీత బోధనలు మనిషిని ధర్మమార్గంలో నడిపించి జీవితానికి సరైన దిశ చూపిస్తాయని నిర్వాహకురాలు స్వతంత్ర, జీవని, గీత సభ్యులు తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని గ్రామ హనుమన్ దేవాలయంలో సోమవారం గీతా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు సమూహంగా గీతా అధ్యాయాలను పారాయణం చేయగా కర్మయోగం, భక్తియోగం, లభిస్తాయని అన్నారు.
BHPL: కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని BHPL జిల్లా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఇవాళ BHPL జిల్లా కేంద్రంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. BCలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని కేటీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద గల జీకే వైన్స్‌లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైకప్పు ఇనుప రేకులు ఊడదీసి లోపలికి చొరబడ్డారు. కౌంటర్‌లో ఉన్న రూ.14,500 నగదుతో పాటు ఐదు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. క్యాషియర్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలు తెలిపారు.
VSP: ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలోని గురజాడ కళా క్షేత్రంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 20 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి, 50కేజీల నుంచి 100 కేజీల వరకు బరువు కలిగిన పురుషులు పాల్గొన్నారు. ఇందులో గెలిచిన విజేతలకు గోల్డ్ మెడల్‌తో పాటు నగదును అందించనున్నారు.
జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు దుమ్మురేపారు. హెట్మేయర్(85) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా, పావెల్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. రూథర్‌ఫోర్డ్(31), షెపర్డ్(21) కూడా దంచికొట్టడంతో విండీస్ 254/6 పరుగుల భారీ స్కోరు చేసింది. హెట్మేయర్ రెండు క్యాచ్‌లను మిస్ చేసి జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకుంది. ముజారబానీ, రిచర్డ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
AP: రాజమహేంద్రవరంలో అనూరియా కేసుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అనూరియా బాధితుల సహాయం, ఫిర్యాదుల కోసం 9494060060 నెంబర్‌ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అధికారులు అండగా ఉన్నారన్నారని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టామని అన్నారు.
NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 29 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ కు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
SDPT: చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్సైగా అపూర్వరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపుతామన్నారు.
AP: రాష్ట్ర పోలీసులపై పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. IPS సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ను పోలీసులు రిజెక్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. FIR, కేసు డైరీ లేకుండా సీనియర్ ఐపీఎస్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల బలవంతపు అరెస్ట్‌ను కోర్టు తప్పబట్టింది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించింది.
JGL: కోరుట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లూరి నరేష్ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై నరేష్ డెకరేషన్ పనికి మెట్‌పల్లి వెళ్తుండగా.. కోరుట్ల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టాడు. దీంతో నరేష్ తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
KMR: మద్నూర్ మండల కేంద్రంలో సార్వజనిక శివ జన్మోత్సవ్ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శాలువాతో ఘనంగా సత్కరించారు.