• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ASF: వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన కొట్రంగి సోనాజి (32) మద్యం మత్తులో బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోనాజీ 2 సం.లుగా పని లేకుండా తిరుగుతున్నాడు. భార్య వదిలేయడంతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

October 1, 2025 / 08:18 PM IST

రైలు ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

TPT: తడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నెంబర్ 2లో రైలు ఎక్కుతూ ఓ వ్యక్తి జారిపడి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. రైలు ఎక్కే ప్రయత్నంలో జారీ రైలు మధ్యలో పడిపోయి తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం స్టేషన్ మాస్టర్ 108 ద్వారా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. కాగా, మృతుడి వివరాలు తెలియలేదని చెప్పారు.

October 1, 2025 / 08:17 PM IST

‘తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నాం’

ELR: మంచినీటి సమస్య లేకుండా కొత్త బోరు పనులకు శ్రీకారం చుట్టామని నారాయణపురం సర్పంచ్ అలకనంద అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురం ఎన్టీఆర్ కాలనీ, వైయస్సార్ కాలనీలో మంచినీటి బోర్లకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య లేకుండా పనులు యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నమన్నారు.

October 1, 2025 / 08:17 PM IST

పెన్షన్లు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడులో బుధవారం డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఆయన లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్‌తో పాటు వారికి చీరలు, పండ్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో రాహుల్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ కిమిడి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

October 1, 2025 / 08:15 PM IST

వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూముల ఏర్పాటు

VSP: వాతావరణంలో మార్పుల కారణంగా విశాఖ జిల్లాలో గురువారం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ బుధవారం తెలిపారు. కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 0891–2590100, ఆర్‌డీవో ఆఫీసు 8500834958 ఏర్పాటు చేశారు.

October 1, 2025 / 08:15 PM IST

దుర్గామాత మండపాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

KMR: జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల, పెద్ద ఏద్గి గ్రామంలోనీ నవరాత్రుల సందర్బంగా దుర్గ భవాని మాత మండపాలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అది శక్తి అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై, పాడి పంటల చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా జగదాంబ భవానినీ ప్రార్థించానని తెలిపారు.

October 1, 2025 / 08:14 PM IST

కౌడిపల్లిలో బతుకమ్మ వేడుకలు

MDK: కౌడిపల్లి మండలంలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. కౌడిపల్లి మండల కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని రెడ్డి వేడుకల్లో పాల్గొని కట్ట మైసమ్మకు, గంగమ్మకు పూజ నిర్వహించారు.

October 1, 2025 / 08:14 PM IST

200 మంది పోలీసులతో బందో బస్తు: ఎస్పీ

ADB: దుర్గా శరన్నవరాత్రి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 80 దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. 200 మంది పోలీసు సిబ్బందితో విభజించి, సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

October 1, 2025 / 08:13 PM IST

వరుస దొంగతనాలతో సవాల్‌గా మారిన దొంగలు

KNR: శంకరపట్నం మండలంలో దొంగలు గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారుదేవాలయాలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ముత్తారం మైలాల మల్లన్న గుడిలో గుర్తుతెలియని దొంగలు రూ. 15వేల అమ్మవారి పుస్తెమెట్టెలు, హుండీలోని రూ. 20వేల నగదు ఎత్తుకెళ్లారు. ఎల్లమ్మ ఆలయంలో రూ. 25వేల అమ్మవారి పుస్తెమెట్టెలు, హుండీలోని రూ. 20వేలను అపహరించారు.

October 1, 2025 / 08:13 PM IST

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి

TPT: ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అత్తివరం రవీంద్ర అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఎస్సీ కులానికి చెంది గూడూరు మండలం ఇందిరమ్మ కాలనీ ఒకటవ వీధికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, మృతుడు స్నేహితులతో కలిసి ఆదిశంకర కాలేజ్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి దగ్గర గల నీటిలో దిగి ప్రమాదవశాత్తు మరణించాడు.

October 1, 2025 / 08:12 PM IST

మదనాపురంలో బీఆర్ఎస్‌కు షాక్

WNP: మదనాపురం మండల BRS సోషల్ మీడియా ప్రధానకార్యదర్శి, మలిదశ ఉద్యమకారుడు దుప్పల్లికి చెందిన రమేష్ బాబు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బుధవారం పార్టీకి రాజీనామాచేసి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో రమేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

October 1, 2025 / 08:11 PM IST

ఆయుధ పూజ నిర్వహించిన ఎస్పీ దంపతులు

సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజయదశమి సందర్భంగా ప్రజలకు, పోలీసు సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో భార్యతో కలిసి ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి చిత్రపటానికి తుపాకులు, వాహనాలకు పూజలు చేశారు. ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

October 1, 2025 / 08:10 PM IST

3% డీఏ పెంచడం శుభపరిణామం: హరీశ్ రావు

SDPT: కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంచడం శుభపరిణామమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పండుగ పూట ఉద్యోగులకు చేదు ఫలాలను మిగిల్చిందని ఎద్దేవా చేశారు.పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను పెంచకుండా చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.

October 1, 2025 / 08:08 PM IST

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NZB: బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా, అన్యాయంపై గెలుపుకు సంకేతంగా విజయదశమిని జరుపుకుంటామని, ప్రతి కుటుంబం చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, వారి కుటుంబాల్లో ఆనందాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

October 1, 2025 / 08:05 PM IST

జగిత్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయం

JGL: దసరా పండుగ వేళ జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 విద్యాలయాలకు అదనంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో ఈ కొత్త విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

October 1, 2025 / 08:05 PM IST