NGKL: కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.
AP: హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. IRR కేసులో సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై రేపు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అధికారబలంతో కేసులు మూసివేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
MNCL: జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నియమ, నిబంధనలు, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
TPT: జాతీయ అయోడిన్ లోప నియంత్రణ కార్యక్రమం కింద తిరుపతి జిల్లాలో 2025–26 సంవత్సరానికి సంబంధించిన IDD సర్వేను DM&HO డా.బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 30 PHCల పరిధిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 6-12 ఏళ్ల విద్యార్థుల మెడ పరీక్షలు చేసి గోయిటర్ స్థితిని పరిశీలించారు. ఇళ్లలో వాడుతున్న ఉప్పు, కొంత మంది విద్యార్థుల మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
VSP: ఏయూ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవాన్ని మార్చి 25న నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ వేదికపై పట్టాలు అందుకోనున్నారు.
VKB: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో VKB జిల్లా పోలీసులు ప్రభంజనం సృష్టించారని ఎస్పీ స్నేహమెహ్రా అన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో పథకాలు సాధించిన పోలీసులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాకు మొత్తం 15 పథకాలు వచ్చాయని తెలిపారు. దీంతో జిల్లా ప్రతిష్ఠను పోలీసులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని వెల్లడించారు.
KMR: మహమ్మద్‌నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంకు చెందిన టేక్మాల్ మమత తన భర్త ప్రమాదంలో మృతి చెందిన అనంతరం, కౌలుకు ఇచ్చిన 7 గుంటల భూమిని తిరిగి ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ KMR జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం తన భర్త సుధాకర్‌కు యాక్సిడెంట్ జరిగి అనంతరం మృతి చెందాడని తెలిపారు.
BPT: జాతీయ పోలీస్ స్విమ్మింగ్ పోటీల సాంకేతిక నిపుణుడిగా చందోలుకు చెందిన షేక్ ఖాజా మొహిద్దీన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం గుంటూరు నగర పాలక సంస్థలో ఈత శిక్షకుడిగా పనిచేస్తున్న ఆయనను, ఫిబ్రవరి 23 నుండి 28 వరకు జరిగే 73వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌కు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఎంపిక చేసింది. ఈ గౌరవం దక్కడంపై ఆయన సోమవారం హర్షం వ్యక్తం చేశారు.
RR: చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో సోమవారం సర్పంచ్ మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పెండింగ్ బిల్లు, తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలోని పని చేయని సీసీ కెమెరాలు రిపేర్ చేయించి వాటిని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్మికులకు యూనిఫామ్ అందజేసి వారిని సన్మానించారు.
NDL: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో అధికారులు వేగంగా పనిచేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. EPTS డాక్యుమెంట్ అప్‌లోడింగ్ లక్ష్యాన్ని 15 లక్షలకు పెంచినందున మండల స్థాయిలో పర్యవేక్షణ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏకీకృత కుటుంబ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేసి వివరాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
KRNL: తుగ్గలి మండల పరిధిలోనే రోల్లపాడు తండాలో విద్యుత్ వైర్లు తగిలి ఇవాళ రెండు ఆవులు మృతి చెందాయి. రోల్లపాడు తండాలోని ఒక వ్యవసాయ తోటలో ఉండే విద్యుత్ వైర్లకు రోల్లపాడు తండాకు చెందిన పాండు నాయక్‌కు సంబంధించిన రెండు ఆవులు తగలడంతో అక్కడికక్కడే రెండు ఆవులు మృతి చెందాయి. మృతి చెందిన ఆవులకు రూ. 80 వేల వరకు ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.
CTR: పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కార్యాలయం పేరుతో ఫేక్ కాల్స్ నమ్మొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. కొంతమంది ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి అన్నదానం, వసతి ఏర్పాట్లు చూస్తామని, అదేవిధంగా ఉచిత శిక్షణ ఇస్తామని కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ASF: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ATP: అనంతపురం రూరల్ జనసేన ముఖ్య నాయకుడు గట్టు సుధాకర్ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో సోమవారం పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాప్తాడు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ సాకే పవన్ జనసేన శ్రేణులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సుధాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.