SKLM: సారవకోట(మం) తల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం దాస్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.
NZB: నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం 31వ వార్డులో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి స్రవంతి పాల్గొని చిన్న పిల్లలకు అన్నప్రాసన, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరి, సహాయకులు సునీత, బస్తీ వాసులు పాల్గొనారు.
VSP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. 85 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 81,001 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేంద్రాల వద్ద బందోబస్తు, 144 సెక్షన్ అమలు, వైద్య శిబిరాలు, తాగునీరు, అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
కృష్ణా: పార్లమెంట్‌లో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం పాల్గొనారు. ఈ సమావేశంలో స్కిల్ ఎక్కువైజేషన్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి విధి నిర్వహణ కమిటీపై కమిటీ సభ్యులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు మేలు చేపడుతుందని పేర్కొన్నారు.
SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్‌లోకి చేరాయని నడిగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలు ముగియడంతో, విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
MNCL: మురుగు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డులోని అన్ని వీధుల్లో కల్వర్టులను త్వరగా నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కౌన్సిలర్ రాజ్ కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు.
కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగగా, జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
BDK: మణుగూరు మండలం అశోక్ నగర్‌లో చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని వైద్యులు పుల్లారెడ్డి సందర్శించారు. మన ఇంటి పరిసరాల్లో దోమలు పుట్టకుండా అవి పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుల్లారెడ్డి, సునీల్ తెలిపారు. అనంతరం హాస్టల్ లోని కిచెన్, స్టాక్ రూమ్‌లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
E.G: వైసీపీ శాసనమండలి సభ్యులు, మాజీ సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వెంటనే వారు క్షమాపణ చెప్పాలని నిడదవోలు MLA, మంత్రి కందులు దుర్గేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. శాసనమండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం అని మంత్రి అన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తిలో శుక్రవారం మరణించిన చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి బింగి అశోక్ కుమార్ కళ్ళను జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్ హైదరాబాద్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు. మృతి చెందినా ఇతరులకు కంటి చూపు అందించి వారికి వెలుగును అందించడానికి నేత్రదానం చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
SRCL: బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్య దర్శిగా కొప్పుల అజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల అజయ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల స్థానిక బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RR: ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. SDNR మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. వార్డుల వారిగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం నుంచి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా పడింది. మార్గం మధ్యలో వాహనం అదుపుతప్పడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సీడ్ యాజమాన్యం బోల్తా పడ్డ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీసింది