• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘వృషకర్మ’ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా?

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్‌ దండు కాంబోలో ‘వృషకర్మ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే మార్చి తొలివారంలో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేశారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

February 20, 2026 / 10:50 AM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ ప్రాంతీయ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

February 20, 2026 / 10:49 AM IST

కూటమి నేతల అత్యవసర సమావేశం

AP: శాసన మండలిలో YCP ఆందోళనల నడుమ కూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో.. TDP, జనసేన, BJP ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైసీపీ చర్యలతో తిరుమల వెంకన్నకు సభలో అవమానం జరిగిందని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని నేతలు నిర్ణయించుకున్నారు. క్షమించారని ఈ నేరాన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.

February 20, 2026 / 10:49 AM IST

శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో మాఘమాస పూజలు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాఘమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. మాఘమాస శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దర్శించుకున్నారు.

February 20, 2026 / 10:48 AM IST

ఈనెల 23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం: డీఈవో

NLR: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ సమగ్ర మహోత్సవంలో భాగంగా సైన్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 23వ తేదీ నుంచి నిర్వహించనున్నామని డీఈవో బాలాజీరావు తెలిపారు. ఇండియా, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సాధించే దిశగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా పది టీంలు పాల్గొనవచ్చని చెప్పారు.

February 20, 2026 / 10:48 AM IST

22న బేస్ లైన్ పరీక్షలు

MDK: ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాలకు ఎస్.వెంకటస్వామి కో-ఆర్డినేటర్ 8008403635 కు ఫోన్ చేయాలని సూచించారు.

February 20, 2026 / 10:46 AM IST

కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కృష్ణా: అవనిగడ్డలో నూతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఈనెల 22వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహంలో ఆయనను కమిటీ పెద్దలు ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం పలికారు.

February 20, 2026 / 10:45 AM IST

MPTC, ZPTC వ్యవస్థలు రద్దు?

TG: రాష్ట్రంలో MPTC, ZPTC వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు, బాధ్యతలు లేవని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. MPTC, ZPTCల స్థానంలో సర్పంచులు MPPలను, MPPలే జెడ్పీ ఛైర్మన్‌ను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాక్ . ఈనెల 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై స్పష్టత రానుంది.

February 20, 2026 / 10:45 AM IST

మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవులపై తీవ్ర ఆసక్తి

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు సమాన హోదా ఉన్న కో-ఆప్షన్ పదవులు రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం 30 వార్డులతో పాటు 4 కో-ఆప్షన్ సీట్లు ఉండటంతో ఎన్నికల్లో టికెట్ రాని ఆశావహులు, తక్కువ మెజారిటీతో ఓడిపోయిన అభ్యర్థులు, మైనారిటీ నాయకులు ఈ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

February 20, 2026 / 10:45 AM IST

‘మన వార్డు -మన శుభ్రత’ కార్యక్రమం

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో కౌన్సిలర్ జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘మన వార్డు -మన శుభ్రత’ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్మికులతో కలిసి వార్డులోని ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడికలు తీయించి, మురుగు నీరు నిల్వ ఉంచకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సమస్యల కొరకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

February 20, 2026 / 10:44 AM IST

నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దు: ఏసీపీ

RR: ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసేటప్పుడు అచ్చం ఒరిజినల్‌ వెబ్‌సైట్లను పోలి ఉండేలా నకిలీ సైట్లు ఉంటాయని, వాటితో జర జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపివి రాజు సూచించారు. ఒక్క అక్షరం తేడాతో మిమ్మల్ని నమ్మిస్తారని, తెలియని వెబ్‌సైట్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అస్సలు ఇవ్వద్దన్నారు. నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మి మోసపోవద్దు అన్నారు.

February 20, 2026 / 10:43 AM IST

నానబెట్టిన నల్ల కిస్మిస్ తింటున్నారా?

మహిళల ఆరోగ్యానికి నానబెట్టిన నల్ల కిస్మిస్ అద్భుత ఔషధమని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి, హార్మోన్ల ఉత్పత్తి బ్యాలన్స్ అవుతుంది. ముఖ్యంగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా మారడమే కాక, చర్మంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. అయితే రాత్రి 6-10 ద్రాక్షలను నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే మంచిది.

February 20, 2026 / 10:43 AM IST

‘బౌద్ధమత ఆనవాళ్లను వెలికి తీయండి’

VZM: బొబ్బిలి మండలం చిత్రకోట బొడ్డవలస వద్ద ఉన్న బౌద్ధమత ఆనవాళ్లను వెలికి తీయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. చిత్రకోటబొడ్డవలస పేరు చిత్రకోటబౌద్ధవలస అని, ఆ ప్రాంతంలో పూర్వం బౌద్ధులు నివాసం ఉండేవారన్నారు. బౌద్ధులు ఆనవాళ్లను వెలికి తీసి భద్ర పరచాలని కోరగా మంత్రి దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు.

February 20, 2026 / 10:42 AM IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం

RR: రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు LBనగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు ONLINEలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

February 20, 2026 / 10:42 AM IST

IND vs SL: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి ‘ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్’ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో శ్రీలంక విసిరిన 119 రన్స్ లక్ష్యాన్ని మన అమ్మాయిలు 13.3 ఓవర్లలోనే ఛేదించారు. దినేష్ వృంద 42, అనుష్క శర్మ 27 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రాధా యాదవ్ 4 వికెట్లు, 28 పరుగులతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి జట్టు తుదిపోరుకు చేరడంలో కీలక పాత్ర పోషించింది.

February 20, 2026 / 10:40 AM IST