టీఆర్ఎస్ నేత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు(Padmarao goud) పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా.. తనపై వస్తున్న వార్తలపై తాజాగా పద్మారావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ సమయంలో ఉత్తరాఖండ్ వెళ్లానని.. ఆ సమయంలో తనకు ఫోన్లు చాలా వచ్చాయని ఆయన తెలిపాడు.
కిషన్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఆయనతో స్నేహంగా ఉన్నానని తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ‘కిషన్ రెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయని… అసెంబ్లీలో పక్క పక్క సీట్ల కూర్చునే వాళ్ళమని గుర్తుచేసుకున్నారు. తన కూతురు పెళ్లికి కిషన్‌రెడ్డికి పెళ్లి కార్డు ఇచ్చానని, అప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారని ఇటీవలే తన ఇంటికి వచ్చి కలిశారని’ వివరణ ఇచ్చారు. కిషన్ రెడ్డి తమ ఇంట్లో అర గంట సేపు ఉండి నా కూతుర్ని ఆశీర్వదించారని పద్మారావు తెలిపారు.
నాకు పార్టీ మరాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసిన పద్మారావు, కేటీఆర్‌ను క్యాంపు ఆఫీసుకు వెళ్లి కలిసివచ్చానని చెప్పారు. తాను ప్రస్తుతం సంతృప్తితో ఉన్నానని… సికింద్రాబాద్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనను హైకమాండ్ ఆదేశిస్తే జపాన్‌లో కూడా పోటీ చేస్తానని చెప్పారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తానని తెలిపారు.
కేంద్రం నుంచి తన నియోజకవర్గంకు ఎలాంటి నిధులు రాలేదని తెలిపారు. గవర్నర్ బిల్లులును ఆమోదించక తప్పదని.. కొన్ని ఫైల్స్ తొందరగా రావని పద్మారావు వివరించారు. కొన్ని నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయని తెలిపారు. అదే విధంగా బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారుతూ చేసిన వ్యాఖ్యలను పద్మారావు తప్పుబట్టారు. పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం లేదని బూరకు తెలియదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు.