గతేడాది చివర్లో వచ్చి అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలె టర్కీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఎన్బీకె 107 వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ అయినా సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ కూడా వర్కింగ్ టైటిల్‌తోనే వచ్చింది. దాంతో ఈ సినిమాకు పలు రకాల టైటిల్స్ వినిపించాయి.
రెడ్డిగారు, జై బాలయ్య వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రం చేయడం లేదు. తాజాగా టైటిల్ లోడింగ్ అంటూ డేట్ ప్రకటించారు మేకర్స్. ముందు నుంచి వినిపించినట్టుగానే ఫైనల్‌గా దీపావళి కానుకగా అక్టోబర్ 21న, అధికారికంగా టైటిల్ రివీల్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. దీంతో అభిమానులు ఆ రోజు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్ట్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఇప్పటికే అనిల్ పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడు. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల.. బాలయ్య కూతురిగా నటించనుంది.