»Myanmar Junta Confirms Air Strike On Kanbalu Village Several Killed
Myanmar: మయన్మార్ లో దారుణం.. వైమానిక దాడిలో 100 మంది మృతి
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్(FighterJet) నేరుగా బాంబులు విసిరిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారు.
Myanmar:మయన్మార్(myanmar) లో దారుణం చోటు చేసుకుంది. ఒక గ్రామంపై వైమానిక దాడిని నిర్వహించినట్లు సైనిక ప్రభుత్వ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఇందులో చాలా మంది పిల్లలు, విలేకరులతో సహా దాదాపు 100 మంది మరణించారు. సగయింగ్ ప్రాంతంలోని కాన్బాలు టౌన్షిప్(kanbalu township)లోని పాజిగై గ్రామం వెలుపల దేశంలోని ప్రతిపక్ష ఉద్యమం స్థానిక కార్యాలయం ప్రారంభోత్సవానికి ప్రజలు గుమిగూడారు.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 150 మంది గుంపుపైకి ఫైటర్ జెట్(FighterJet) నేరుగా బాంబులు విసిరిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు ఉన్నారని, చనిపోయిన వారిలో స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
కాగా, ఫిబ్రవరి 2021లో సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. 2021లో సైనిక తిరుగుబాటుతో దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చిన సాయుధ వ్యతిరేక సమూహాలలో పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్(People Defence force) ఒకటి.