మునుగోడులో పలువురికి మందు పోయడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. వరుసకు బావలు, అన్నలు అయిన వారికి మాత్రమే తాను మందు పోసినట్లు స్పష్టం చేశారు. మా చుట్టాల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చుట్టాల ఇంటికి వెళ్లినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
తాను ఎక్కడో బయట ఫంక్షన్ హాల్లో లేనని….తన బంధువుల ఇంట్లోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలనే ఆ ఫొటోను వైరల్ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు మునుగోడులో కొంచెం కూడా అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీ, కాంగ్రెస్ లీడర్లుకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను తీర్చి ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు.