»Man Slits Friends Throat Drinks His Blood Over Affair With Wife
Karnataka:స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగిన వ్యక్తి .. కారణం తెలిస్తే షాక్
కర్నాటక జిల్లాలో ఇప్పటి వరకు విననటువండి సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన స్నేహితుడి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోసి రక్తం కూడా తాగేశాడు.
Karnataka: కర్నాటక జిల్లాలో ఇప్పటి వరకు విననటువండి సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన స్నేహితుడి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోసి రక్తం కూడా తాగేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడి హత్య వెనుక వ్యక్తి చెప్పిన కారణం వింటే మీరు కంగుతింటారు.
హృదయ విదారకమైన ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో చోటుచేసుకుంది. కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించాడు. దీనిపై మాట్లాడేందుకు విజయ్ తన స్నేహితుడు మారేష్‌ను ఇంటికి పిలిచాడు. మాటల్లో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో కోపోద్రిక్తుడైన విజయ్ పదునైన ఆయుధంతో మారేష్‌పై దాడి చేశాడు. పదునైన ఆయుధం మారేష్ మెడపై తగిలింది. అతని గొంతులోంచి రక్తం కారడం మొదలైంది. ఆ తర్వాత విజయ్ తన స్నేహితుడు మారేష్ రక్తాన్ని తాగాడు. ఈ ఘటనను విజయ్‌కి చెందిన మరో స్నేహితుడు తన ఫోన్లో వీడియో తీశాడు. ఈ ఘటన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు.
గాయపడిన మారేష్ పరిస్థితి నిలకడగా ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే మారేష్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా, ప్రస్తుతం బాధితుడి పరిస్థితి బాగానే ఉంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంటికి వచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.