»Major Symptoms Of Malaria Fever With Shivering Pain In Body
World Malaria Day : మీకు ఈ లక్షణాలు ఉన్నాయా.. తస్మాత్ జాగ్రత్త
ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ మలేరియా దినోత్సవం'(World Malaria Day ) జరుపుకుంటారు. ఆడ అనాఫిలిస్ దోమ(female Anopheles mosquito) కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా చికిత్సను సకాలంలో ప్రారంభించినట్లయితే రోగి 2 నుండి 5 రోజులలోపు కోలుకోవచ్చు.
World Malaria Day : ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ మలేరియా దినోత్సవం'(World Malaria Day ) జరుపుకుంటారు. ఆడ అనాఫిలిస్ దోమ(female Anopheles mosquito) కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా చికిత్సను సకాలంలో ప్రారంభించినట్లయితే రోగి 2 నుండి 5 రోజులలోపు కోలుకోవచ్చు. సాధారణ మలేరియా(Malaria) అయితే రోగి కోలుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. కానీ మలేరియా పరిస్థితి తీవ్రంగా ఉంటే, రోగి ఆసుపత్రి(Hospital)లో చేరవలసి ఉంటుంది. మలేరియాలో మందులతోపాటు సరైన ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి బలం చేకూరి.. రోగి త్వరగా కోలుకోవచ్చు.
మలేరియా లక్షణాలు..
మలేరియా రోగికి అధిక జ్వరంతో పాటు తలనొప్పి ఉంటుంది. దీనితో పాటు శరీర నొప్పులు, కండరాల నొప్పులు కూడా సంభవించవచ్చు. అలాగే రోగికి వణుకు ఉంటుంది. అలసిపోయినట్లు, చంచలమైన అనుభూతి కలుగుతుంది. మలేరియా రోగులకు విరేచనాలు కూడా అవుతుంటాయి. వాంతులు, వికారం, శరీరానికి తీవ్ర చెమట లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మలేరియా నిర్ధారణ
మలేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ల్యాబ్ పరీక్షల ద్వారా మలేరియా నిర్ధారణ అవుతుంది. ఇందుకోసం మలేరియా పరాన్నజీవి, మలేరియా యాంటిజెన్ పరీక్ష(malaria antigen test) చేస్తారు. ఈ పరీక్షల ద్వారా ఒక వ్యక్తికి ఎలాంటి మలేరియా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ మలేరియా సోకినట్లయితే, సరైన చికిత్స చేస్తే, వ్యక్తి మూడు నుండి ఐదు రోజుల్లో కోలుకోవచ్చు.