»To Get Amazing And Effective Health Benefits Add Ajwain Seeds To Your Food Recipes Check Here
Ajwain Seeds : వాము తింటే ఇన్ని లాభాలుంటాయా ?
పూర్వ కాలం నుంచి ఆయుర్వేదంలో వామకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వామ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే పెద్దలు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున వామ తినమని సూచిస్తారు. వాములో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
Ajwain Seeds : పూర్వ కాలం నుంచి ఆయుర్వేదంలో వామకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వామ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే పెద్దలు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున వామ తినమని సూచిస్తారు. వాములో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అంతే కాకుండా నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాము విత్తనాలలో థైమోల్ అనే ముఖ్యమైన నూనె కూడా ఉంటుంది. ఇది మంచి సువాసనను ఇస్తుంది. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె జబ్బులతో సహా అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో, కణాలలో కనిపించే మైనపు పదార్థం. మన శరీరంలో ఉండే ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. మిగిలినది మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. అసలు వామును తీసుకుంటే ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం..
జలుబును నియంత్రిస్తుంది
దగ్గు, జలుబును తగ్గేందుకు కూడా వాము చాలాబాగా పనిచేస్తుంది. శ్లేష్మాన్ని సులభంగా తొలగించడానికి, మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగించడానికి వాము సహాయపడుతుంది. మూసుకుపోయిన నాసికా మార్గాలను తెరవడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఉబ్బసాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది
వాము చెడు కొలెస్ట్రాల్ ను తగ్గింగి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ విత్తనాలలో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
జీర్ణక్రియ పెరుగుతుంది
ఉదర సమస్యను తగ్గించేందుకు వాము అద్భుతంగా పని చేస్తుంది. వాములోని క్రియాశీల ఎంజైమ్లు గ్యాస్ట్రిక్ రసాల విడుదలను సులభతరం చేస్తాయి. దీంతో మీ జీర్ణక్రియ పెరుగుతుంది. వాము గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, అసౌకర్యం వంటి దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాలు వాము కడుపు పూతలు, పేగు పూతలను నివారించడానికి సహాయపడతాయి.
రక్తపోటును తగ్గిస్తుంది
ఈ విత్తనాల్లోని థైమోల్ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే రక్తపోటును తగ్గించడానికి సహాయపడే కాల్షియం రక్తపోటు గుండె కణాలు, రక్తనాళాల గోడలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.