ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా.. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఇక మహేష్ లండన్ ట్రిప్ నుంచి తిరిగి రావడంతో.. నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగ చెప్పుకొచ్చాడు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని.. ఇక పై ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్ రానున్నాయని చెప్పాడు.
ఈ షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతుంది. మహేష్(Mahesh), పూజాలపై కొన్ని కీలక సీన్స్ తెరకెక్కించబోతున్నారట. ఇక ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయబోతున్నాడు మహేష్. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి స్టార్ట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది.
ముందుగా 2023 జనవరిలోనే ఈ సినిమాను లాంచనంగా మొదలు పెట్టబోతున్నట్టు వినిపించింది. కానీ ఎస్ఎస్ఎంబీ28 ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నారు.. కాబట్టి 2023 ఏప్రిల్ లేదా మేలో ఎస్ఎస్ఎంబీ 29 లాంచ్ చేసి.. జూన్‌లో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. అలాగే వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి.. 2024 ఎండింగ్ లేదా 2025లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.