చంద్రగ్రణహం పూర్తి అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించాడు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాలు కొనసాగింది.
దేశంలో 2 గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించింది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది.
ఈశాన్య రాష్ట్రాల్లో గంట ముందే చంద్రగ్రహణం ఏర్పడింది.ఇక, చంద్రగ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన ఆలయాలు.. గ్రహణం వీడటంతో తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఇదే చిట్టచివరి చంద్రగ్రహణం. గ్రహణం ముగియటంతో జనం నదీ స్నానాలు ఆచరిస్తున్నారు.
సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్ర గ్రహణం కనువిందు చేసింది. మళ్లీ చంద్రగ్రణహం కనిపించేది మూడేళ్ల తర్వాత అంటే..2025లోనే. దేశంలో 2025 సెప్టెంబర్ 7న తిరిగి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే, పాక్షిక చంద్ర గ్రహణం మాత్రం 2023 అక్టోబర్లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.