Komatireddyతో జూపల్లి భేటీ.. టీ తాగడానికే వచ్చానని కామెంట్
ఏ పార్టీలో చేరతామనే అంశంపై జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇవ్వడం లేదు. వరసగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. నిన్న మల్లు రవిని కలువగా.. ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మీట్ అయ్యారు.
Jupally Krishna Rao: జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అండ్ కో ఏ పార్టీలో చేరతారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీలో చేరతారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. జూన్ 15వ తేదీ వరకు స్పష్టత వస్తుందని చెప్పగా.. నిన్న కాంగ్రెస్ ముఖ్యనేత మల్లు రవితో సమావేశం అయ్యారు. ఈ రోజు సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. జూపల్లి (Jupally) అడుగులు ఎటు వైపు అనే చర్చ మాత్రం జరుగుతోంది.
టీ తాగడానికే వచ్చా..
సమావేశం అనంతరం జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీలో చేరికకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి టీ తాగడానికే వెళ్లానని వెల్లడించారు. రాజకీయాలు ఏం మాట్లాడలేదని వివరించారు. జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) మర్యాదపూర్వకంగా ఇంటికి ఆహ్వానించానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కోరానని పేర్కొన్నారు. ఆలోచించి తన నిర్ణయం చెబుతానని జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తనో చెప్పారని వెల్లడించారు. ఇలా ఇద్దరు నేతలు తలో మాట చెప్పారు.
సస్పెన్స్ కంటిన్యూ
జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏ పార్టీలో చేరతారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలతో వరసగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తమ లక్ష్యం సీఎం కేసీఆర్.. ఆయన్ను ఓడించడమే టార్గెట్ అని జూపల్లి అండ్ కో చెబుతున్నారు. తమతో కలిసి వచ్చే నేతలతో బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేస్తామని అంటున్నారు. ఏ పార్టీ.. ఏ రాజకీయ వేదిక అనేది ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. జూపల్లి (Jupally) విధించిన డెడ్లైన్ 15వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరతామనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.