సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి ఏపీలో జేడీ పోటీ చేయనున్నారంటూ ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో… ఆ రూమర్స్ పై తాజాగా జేడీ స్పందించారు.
విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అయితే… ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. అవసరమైతే తాను… స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం.
తాను ఆప్, జనసేన పార్టీలో చేరతానంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది అన్నారు లక్ష్మీనారాయణ. తాను బీఆర్ఎస్లో చేరతానని కూడా ప్రచారం చేశారని.. కొందరు సెన్సేషన్ కోసం.. అలాగే యూ ట్యూబ్ ఛానళ్లు ఇలా చేస్తున్నాయన్నారు. వారికి వ్యూస్ ఎలా వస్తాయి.. జేడీ వ్యవసాయం చేస్తున్నారంటే వ్యూస్ రావు.. అదే ఆప్ , జనసేన పార్టీ , బీఆర్ఎస్ లో చేరతారంటే వ్యూస్ వస్తాయంటూ ఛమత్కరించారు. ఇవన్నీ కొందరు ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేస్తున్నవే అన్నారు. ఇప్పటికే తాను పోటీపై క్లారిటీ ఇచ్చానని గుర్తు చేశారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అన్నారు. తన ఆలోచనలతో పార్టీలు ఏకీభవిస్తే వాళ్లతో మాట్లాడతానని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండిపెండెంట్‌గా పోటీచేసే ఆప్షన్ ఉందని గుర్తు చేశారు. విశాఖ ప్రజలు గత ఎన్నికల్లో తనను ఆదరించారని.. అందుకే అక్కడే పోటీ చేస్తాను అన్నారు. తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఏకీభవించే పార్టీ వైపు వెళతాను అన్నారు. అవసరం లేదనుకుంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు.