Google Pixel 7a:గూగుల్ తన కొత్త మొబైల్ వేరియంట్‌ను తీసుకొస్తోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) అప్ డెటెడ్ వేరియంట్‌గా గూగుల్ పిక్సెల్ 7ఏ రానుంది (Google Pixel 7a). 7ఏతో పాటు పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కూడా లాంచ్ చేస్తారు. పిక్సెల్ 7ఏ ఇమేజ్ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (flipcart) పెట్టింది. ఈ నెల 11వ తేదీన మొబైల్ లాంచ్ చేయనుందని పేర్కొంది.
గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఫీచర్స్‌ను టిప్ స్టార్ (tipstar) లీక్ చేసింది. పిక్సెస్ 7 సిరీస్ డిజైన్ మాదిరిగా పిక్సెల్ 7ఏ మొబైల్ ఉండనుందని తెలిసింది. ఆర్కిట్ బ్లూ, కార్బన్, కాటన్ కలర్ వే రంగులో మొబైల్ లభిస్తోందని తెలిసింది.
6.1 ఇంచుల ఫుల్ హెచ్ ప్లస్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. హై రిజల్యూషన్ ఉంటుంది. డ్యుయల్ రియర్ కెమెరా (dual rear camera) ఇచ్చారు. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగా పిక్సెల్ సెన్సార్ విత్ అల్ట్రా వైడ్ లెన్స్ ఇచ్చారు. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు.
మొబైల్ ధర (rate) కూడా లీకయ్యింది. ధర రూ.32 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండే అవకాశం ఉంది. మిడ్ రేంజ్లో ధర ఉండటంతో మొబైల్ విక్రయాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని టెక్ నిపుణులు కూడా చెబుతున్నారు.