వేసవి(Summer)లో వేడి వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. మన ఆరోగ్యం(Health) కూడా క్షీణిస్తుంది. అందుకే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. పుచ్చకాయ, మామిడి వంటి సీజనల్ పండ్లు తీసుకోవడం ఎంతో మంచిది. అలా కాకుండా తినకూడదని కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటే మాత్రం పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి వేసవిలో తినకూడదని ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
వేయించిన ఆహారాలు: వేసవిలో వేయించిన ఆహారాలు(Fried Foods) ఎక్కువగా తీసుకోకండి. చాలా మంది డీప్‌ఫ్రైడ్ ఫుడ్స్‌ని ఇష్టపడుతుంటారు. అలాంటివారు వేయించిన పదార్థాలు తినడం వల్ల నీరసం కలుగుతుంది. అంతేకాకుండా కడుపు అసౌకర్యానికి గురవుతుంది.
మసాలా వంటకాలు:మసాలా వంటలకు దూరంగా ఉండటం మంచిది. చాలా మంది కారం ఎక్కువగా ఉండే వంటకాలను తీసుకుంటూ ఉంటారు. దాని వల్ల శరీర ఉష్ణోగ్రత(Body Temperature) అధికంగా పెరుగుతుంది. తద్వారా అధిక చెమట పడుతుంది. శరీరం చల్లగా ఉండాలంటే మసాలా దినుసులను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కార్బోనేటేడ్ డ్రింక్స్: కొన్ని రకాల పానియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కార్బోనేటేడ్ డ్రింక్స్(Drinks) వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇటువంటి పానీయాలలో అధిక స్థాయి చక్కెర, అర్టిఫిషియల్ రంగులు, రుచులు ఉండటంతో అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వేసవిలో వాటికి దూరంగా ఉండటం మంచిది. వాటికి బదులుగా తాజా పండ్ల రసాలు, హెర్బల్ టీ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
రెడ్ మీట్: వేసవిలో రెడ్ మీట్(Red Meat) తీసుకోవడం తగ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ మీట్ అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అది శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతుంది. రెడ్ మీట్‌కు బదులుగా చేపలు, చికెన్ లేదా ఆకుకూరలను తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కెఫిన్:వేసవిలో ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లే అవకాశం ఉంది. దాని వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. అందుకే కెఫీన్(Cafine) పదార్థాలను తీసుకోవడం తగ్గించండి. వాటికి బదులుగా హెర్బల్ టీలు తాగండి. పండ్ల రసాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మజ్జిగ, నిమ్మరసం వంటివి శరీరానికి శక్తిని అందిస్తాయి.