»Floods 145 People Died Due To Floods Schools And Colleges Closed Till 16
Floods: వరదలతో 145 మంది మృతి..16 వరకు స్కూల్లు, కాలేజీలు బంద్
దేశవ్యాప్తంగా వరదల కారణంగా 145 మంది మృతి చెందారు. కొండచర్యలు విరిగిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఢిల్లీలో జూలై 16 వరకు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
145 people died due to floods. Schools and colleges closed till 16
floods: దేశవ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తన్నాడు. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 145 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలతో ఏకదాటిగా వరదలు, కొండచరియలు విరిగిపడడంతో స్థానికులు భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో నుంచి నార్త్ లో పర్యాటనకు వెళ్లిన వారు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వరదల కారణంగా ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, హర్యానాలో 16, పంజాబ్‌లో 11, ఉత్తరాఖండ్‌లో 16 మంది మృతి చెందారు.
చదవండి:Baby Movie Review: బేబీ మూవీ రివ్వ్యూ..హిట్టా ఫట్టా?
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో నేడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు వరదల్లో కూరుకుపోయాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదల నేపథ్యంలో ఢిల్లీలో పాఠశాలల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ప్రయాణం దృష్ట్యా జూలై 16వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పర్యాటకులు ఎక్కువగా వచ్చే తాజ్ మహాల్, ఎర్రకోట సందర్శనను ఈ రోజు నిలివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
#WATCH Delhi: People face problems due to water-logging situation on ITO road due to the increase in the water level of the Yamuna River. pic.twitter.com/XEOY6F4BGl