WNP: దేశానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మహర్షి వాల్మీకి మహానీయుడు అని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి కలెక్టరేట్లో ఆయన జయంతి నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. నాయక్ మాట్లాడుతూ.. ఆయన రచించిన రామాయణం ద్వారా సమాజం అనేక విలువలను అందుకున్నారని కొనియాడారు.