ప్రకాశం: మార్కాపురం పట్టణ ప్రజలు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను 2025 డిసెంబర్ 31 లోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు విజ్ఞప్తి చేశారు. రెండవ అర్థ సంవత్సరం పన్ను పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితీ పొందాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పన్ను చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.