శివసేన పార్టీ చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎప్పటికీ రాజ్ ఠాక్రేతో రాజకీయ స్నేహం చేయనని తెలిపారు. రాష్ట్రాన్ని దోచేస్తున్న వారికి సాయం చేయకూడదని పేర్కొన్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దోపిడీదారులకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు.