AP: బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలబాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యత దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడాలని అన్నారు. పిల్లల హక్కులు కాపాడటమే తానిచ్చే చిల్డ్రన్స్ డే కానుక అని పేర్కొన్నారు.