బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వేకు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ వరించింది. అంతరిక్ష యాత్రికులపై రాసిన ‘ఆర్బిటల్’ నవల 2024 ఏడాదికిగాను ఈ ప్రైజ్ వచ్చింది. ఈ బహుమతి కింద రచయితకు రూ.53.65 లక్షలు అందజేస్తారు. పైనుంచి భూమిపై 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమగాముల జీవితాల్లో ఒకరోజంతా జరిగే పరిణామాలను ఇందులో ఆమె వివరించారు.