ASR: 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆడబిడ్డ జన్మించిన ఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది. బూదరాళ్ల గ్రామానికి చెందిన వి.మణికి పురిటి నొప్పులు రావడంతో రాజేంద్రపాలెం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. కాన్పు కష్టం అవ్వడంతో 108 వాహనంలో నర్సీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో డెలివరీ అయ్యిందని 108 సిబ్బంది అశోక్ రాజు తెలిపారు.