సినీ నటి కస్తూరికి మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. కస్తూరికి ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు అక్కడే స్థిరపడ్డారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చెన్నైలో కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న కస్తూరి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు.