ప్రకాశం: కావలిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై, సోషల్ మీడియా సానుభూతిపరులపై పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. కావలి డీఎస్పీ ఎం. శ్రీధర్‌ను ఆయన కలిసి మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వ్యక్తులు కూడా ఫిర్యాదులు అందజేస్తారని పోలీసులు వాటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు.