VZM: జీడి పంటను సాగుచేసే రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో నమోదు కావడానికి రెండు రోజులే గడువు ఉందని చీపురుపల్లి డివిజన్ ఉద్యానాధికారి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస, బొండపల్లి, వెదుళ్లవలస, చీపురుపల్లిలోని పెదనడిపల్లి, మెరకముడిదాం మండలంలోని గరుగుబల్లి, గాతాడ, భీమవరం గ్రామాల్లో బీమాపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.