బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఓట్ల షేర్ దిశగా NDA దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అధికార NDA కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 171 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్ ప్రాంతంలోనూ NDA తన సత్తా చాటుతోంది. ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ కూటమి 64 స్థానాల్లో ముందంజలో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇతరులు లీడ్లో ఉన్నారు.